Hema : డ‌బ్బు కోసం ఏమైన చేస్తా.. అది ఒక్కటి త‌ప్ప అంటూ హేమ సంచ‌ల‌న కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hema : డ‌బ్బు కోసం ఏమైన చేస్తా.. అది ఒక్కటి త‌ప్ప అంటూ హేమ సంచ‌ల‌న కామెంట్స్

Hema : సినీ న‌టి హేమ ఇటీవ‌ల ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. గతనెల ప్రముఖ వ్యాపారవేత్త జన్మదిన వేడుకల్లో భారీగా డ్రగ్స్ వినియోగించినట్టు వచ్చిన ఆరోపణల కేసులో హేమ‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆమెకు ఈ కేసులో బెయిల్ లభించింది. బెయిల్ లభించిన తర్వాత హేమ జైలు నుంచి బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె జైలు గేట్ వద్ద సంతకం చేస్తుండగా ఆమెతో కొందరు […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 June 2024,5:30 pm

Hema : సినీ న‌టి హేమ ఇటీవ‌ల ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. గతనెల ప్రముఖ వ్యాపారవేత్త జన్మదిన వేడుకల్లో భారీగా డ్రగ్స్ వినియోగించినట్టు వచ్చిన ఆరోపణల కేసులో హేమ‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆమెకు ఈ కేసులో బెయిల్ లభించింది. బెయిల్ లభించిన తర్వాత హేమ జైలు నుంచి బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె జైలు గేట్ వద్ద సంతకం చేస్తుండగా ఆమెతో కొందరు ఫోటోలు దిగితూ కనిపించారు. అయితే అనంతరం ఆమె హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సిద్దమయ్యారు.

Hema  త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు..

ఈ క్రమంలో ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోగా.. వారితో మాట్లాడే పనేముంది? వారితో మాట్లాడాల్సిన అవసరం లేదనే మాటలు ఆమె నుంచి వినిపించాయి. దాంతో ఆమెలో ఉండే ముక్కుసూటి తనం మరోసారి బయటపడింది. అయితే కన్నడ మీడియాలో మాత్రం మీడియాతో మాట్లాడకుండా ఆమె దురుసుగా వెళ్లిందనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ మధ్య ఓ ఇంట‌ర్వ్యూలో హేమ మాట్లాడిన మాట‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కేవలం సినిమా మీదే ఆధార పడి ఉంటే ఇంత డబ్బు ఉండేది కాదు అని తెలిపింది. ఎంత డబ్బు ఉన్నా కోట్ల విలువ చేసే ఫ్లాట్ లు, బీఎండబ్ల్యూ కార్లు ఎలా సంపాదించారు అని యాంకర్ ప్రశ్నించారు. హేమ సమాధానం ఇస్తూ మా ఊర్లో నాకు ఆస్తులు ఉన్నాయి. నా భర్త సంపాదిస్తారు. అలాగే నేను కూడా చిట్టీలు లాంటి వ్యాపారాలు చేస్తాను. కాబట్టి నా లైఫ్ హ్యాపీ అని తెలిపింది.

Hema డ‌బ్బు కోసం ఏమైన చేస్తా అది ఒక్కటి త‌ప్ప అంటూ హేమ సంచ‌ల‌న కామెంట్స్

Hema : డ‌బ్బు కోసం ఏమైన చేస్తా.. అది ఒక్కటి త‌ప్ప అంటూ హేమ సంచ‌ల‌న కామెంట్స్

అంతా అనుకుంటున్నట్లు నా దగ్గర వందల కోట్లు అయితే లేవు అని తెలిపింది. ఎంత డబ్బు ఉన్నా నేను గంజి నీళ్లు తాగి బతకగలను. అడవిలో వదిలేసినా బతుకుతా. నాకు లగ్జరీ లైఫ్ మాత్రమే అవసరం లేదు అని తెలిపింది. పని విషయంలో నాకు చిన్న చూపు లేదు. డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి పని అయినా చేస్తాను. అయితే తలవంచుకునే పని మాత్రం చేయను అని తెలిపింది. ఈ మాటలనే వైరల్ చేస్తూ.. హేమ రేవ్ పార్టీలో దొరికిన విషయాన్ని నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. తలదించుకునే పని మాత్రం జీవితంలో చేయను అని తెలిపింది. ఇప్పుడు రేవ్ పార్టీలో దొరికిపోయి పరువు పోగొట్టుకుందిగా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. హేమ‌ని మా అసోసియేష‌న్ నుండి కూడా త‌ప్పించిన విష‌యం తెలిసిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది