Rakul Preet Singh : హీరోయిన్ రకుల్ పెళ్లిపై ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యల వీడియో..!!
Rakul Preet Singh : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అందరికీ సుపరిచితుడే. సెలబ్రిటీల జీవితాలలో ఏమేమి జరుగుతాయో ముందుగానే చెప్పి ఇటీవల మంచి గుర్తింపు సంపాదించారు. ఇదే సమయంలో రాజకీయ రంగంలో సైతం ఎవరు అధికారంలోకి వస్తారనేది కూడా ముందుగానే వేణు స్వామి చెబుతున్న పరిణామాలు చోటు చేసుకోవడంతో ఈయన పేరు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగుతుంది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని తెలిపారు.
ఇక ఈ ఏడాదిలో కొంతమంది తెలుగు సినిమా రంగానికి చెందిన వాళ్లు విడాకులు తీసుకుంటారని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రభాస్ నటించిన “ఆదిపురుష్”.. పరాజయం పాలవుతుందని ముందుగానే చెప్పుకొచ్చారు. అన్నీ కూడా ఆ రకంగానే జరిగాయి. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ పెళ్లి గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ నిశ్చితార్థం జరిగిన వెంటనే ఆమె కెరియర్ డౌన్ అయిపోతుందని అప్పట్లోనే హెచ్చరించాను. ఇప్పుడు పరిస్థితి చూడండి ఆమెకు ఏ అవకాశాలు లేవు అంటూ లేటెస్ట్ ఇంటర్వ్యూలో వేణు స్వామి గుర్తు చేశారు.
venu swamy reveals rakul preet singh horoscope
ఇదే సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్న గాని ఆమె విడిపోవడం గ్యారంటీ అని బాంబు లాంటి కామెంట్లు చేశారు. సమంత నాగచైతన్య విడిపోతారని అప్పట్లో తాను చెప్పిన జాతకం సమయంలో బండ బూతులు తిట్టారు.. ఇప్పుడు పరిస్థితి ఏంటి. రకుల్ ప్రీత్ సింగ్ జాతకం కూడా అలాంటిదే అంటూ వేణు స్వామి లేటెస్ట్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
