Venu Swamy : మరో బాంబు పేల్చిన వేణు స్వామి.. రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లిపై సంచలన కామెంట్స్..!!
Venu swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా ఆయన వద్ద పలువురు హీరో, హీరోయిన్స్ పూజలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఇటీవల రష్మిక మందన్నా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తనతో ఎందుకు మాట్లాడటం లేదో కూడా చెప్పుకొచ్చారు. రష్మిక, విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ గురించి బయట పెట్టారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వారి జాతకాలు చూశాక ఇద్దరు విడిపోతారని రష్మిక కు ఆ విషయం చెప్పాను.
ఈ విషయాన్ని ఆమెకు డైరెక్ట్ గా చెప్పడం రష్మికకు నచ్చలేదు. విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకోకు అని చెప్పాను. ఆ విషయంలో నాకు రష్మిక కి విభేదాలు రావడంతో, ఆమె అందుకే నాతో మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు. అప్పటివరకు నా క్లైంట్ గా ఉన్న రష్మిక ఆ గొడవతో దూరంగా ఉండిపోయిందని అన్నారు. అయినా నాకేం ఇబ్బంది లేదని ఇంటర్వ్యూలో వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఈ విషయం పక్కన పెడితే ఇటీవల వేణు స్వామి చెప్పిన జాతకాలు బెడిసి కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ట్రోలింగ్కి కూడా గురవుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఇక కెరీర్ ఉండదని గతంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఈ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ఓ ఆట ఆడుకున్నారు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నాలుగు సినిమాలు చేస్తే మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయంటూ వేణుస్వామి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
కానీ ఆయన చెప్పిన కొన్ని సెలబ్రిటీల జాతకాలు నిజమయ్యాయి. నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నప్పుడు విడిపోతారు అని చెప్పాడు. అతడు అన్నట్లుగానే కొద్ది కాలానికి సమంతా, నాగ చైతన్య విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో అప్పటినుంచి వేణు స్వామి జ్యోతిష్యుడిగా బాగా పాపులర్ అయ్యారు. ఆయన చెప్పిన కొన్ని జరగడంతో, ఆయన చెప్పబోయేది నిజమే అని నమ్ముతూ వస్తున్నారు. అయితే కొన్ని జాతకాలు బెడిసి కొట్టడంతో వేణు స్వామి ట్రోలింగ్ కి కూడా గురవుతున్నారు. అంతేకాకుండా వాటిని కవర్ చేస్తూ వస్తున్నారు. అయితే రష్మిక , విజయ్ దేవరకొండ నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నారా..? వేణు స్వామి చెప్పడం వలనే ఆగిపోయారా..! అని ఫాన్స్ లో సందేహాలు మొదలయ్యాయి.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.