Venu Swamy Wife : లడ్డూ విషయంలో వారు ఎంత ఓవర్ చేశారు.. ఒక్కొక్కరిని కడిగి పారేసిన వేణు స్వామి భార్య
Venu Swamy Wife : గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారం ఎంత రచ్చగా మారిందో మనం చూశాం. అయితే తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని సుప్రీంకోర్టు తెలిపింది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని అడిగింది. సిట్ను కొనసాగించాలో లేదో […]
ప్రధానాంశాలు:
Venu Swamy Wife : లడ్డూ విషయంలో వారు ఎంత ఓవర్ చేశారు.. ఒక్కొక్కరిని కడిగి పారేసిన వేణు స్వామి భార్య
Venu Swamy Wife : గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారం ఎంత రచ్చగా మారిందో మనం చూశాం. అయితే తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని సుప్రీంకోర్టు తెలిపింది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని అడిగింది. సిట్ను కొనసాగించాలో లేదో చెప్పాలని కూడా కోరింది. రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని అంది. అసలు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనే వివరాలను టీటీడీ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.
Venu Swamy Wife క్షమించమని కోరండి..
జూన్ నుంచి జులై వరకు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనేది టీటీడీ న్యాయస్థానానికి వివరించింది. అయితే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటని సర్వోన్నత న్యాయస్థానం టీటీడీ న్యాయవాదిని ప్రశ్నించింది.కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి ట్యాంకర్ అనుమతించలేదని టీటీడీ చెప్తుంటే.. సీఎం ప్రకటన ఎందుకు భిన్నంగా ఉందని సుప్రీంకోర్టు అడిగింది. కల్తీపై క్లారిటీ లేకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మీద కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిట్ విచారణ జరగకుండానే సీఎం ప్రకటన ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సరిగ్గా విచారణ జరపగలదో లేదో అనే అనుమానం వ్యక్తం చేసింది.
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. వేణు స్వామి భార్య శ్రీవాణి స్పందించారు. ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.” పరమపవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను హింసించేశారు. రాజకీయ నాయకులను పక్కన బెడితే.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారా..? ప్రాయశ్చిత్త శ్లోకాలు వారే కనిపెట్టేసి.. వాటిని చెప్పించేసి, ఏమన్నా రచ్చ చేశారా? ఎంతో మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారు. మీరు నిజమైన హిందువులైతే.. వెంకటేశ్వరస్వామి భక్తులైతే.. మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా?” అంటూ శ్రీవాణి వీడియో విడుదల చేశారు.