Venu Swamy : నాగ చైతన్యని గిఫ్ట్ కావాలంటున్న వేణు స్వామి భార్య.. మీడియాపై అంత కోపం ఎందుకు..!
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఆయన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. నాగచైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి హాట్‌టాపిక్‌గా నిలిచారు. వీరిద్దరి వైవాహిక జీవితంపై జ్యోతిష్యం చెప్పి సంచలనంగా మారారు. సమంత-నాగచైతన్య మాదిరిగానే నాగచైతన్య-శోభితల జాతకం కలవలేదని, వీరద్దరు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరంటూ చెప్పడంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయమై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు […]
ప్రధానాంశాలు:
Venu Swamy : నాగ చైతన్యని గిఫ్ట్ కావాలంటున్న వేణు స్వామి భార్య.. మీడియాపై అంత కోపం ఎందుకు..!
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఆయన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. నాగచైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి హాట్‌టాపిక్‌గా నిలిచారు. వీరిద్దరి వైవాహిక జీవితంపై జ్యోతిష్యం చెప్పి సంచలనంగా మారారు. సమంత-నాగచైతన్య మాదిరిగానే నాగచైతన్య-శోభితల జాతకం కలవలేదని, వీరద్దరు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరంటూ చెప్పడంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయమై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్టు స్వయంగా వేణు స్వామి చెప్పారు. వేణు స్వామి పై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందింది.
Venu Swamy వేణు స్వామి భార్య ఆగ్రహం..
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ , తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ , సోషల్ మీడియా లో ఫిల్మ్ సెలబ్రిటీస్ పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే.. ఆయన చెప్పిన జ్యోతిష్యం… సంచలనంగా మారింది. తాను వేణు స్వామి భార్యగా కాదని, సీనియర్ జర్నలిస్ట్‌గా మాట్లాడుతున్నానని మీడియాను ఏకేశారు. తాజాగా మరోసారి ఓ వీడియోని వదిలారు. ఈ సారి నాగ చైతన్య ఓ గిఫ్ట్ కావాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోలో ఆమె యాటిట్యూడ్, మాట్లాడే తీరుని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
నాగ చైతన్య, శోభిత మీకు కంగ్రాట్స్.. హ్యాపీగా ఉండండి.. మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి.. సో కాల్డ్ యోధులు వేరే వాళ్లని టార్గెట్ చేసి.. మీ టాపిక్‌ను డీవీయేట్ చేయడం ఏంటి? తుంటిని కొడితే పళ్లు ఊడినట్టు అంటూ ఇలా ఓ వీడియోని షేర్ చేశారు. ఈ క్రమంలో ఆమె కామెంట్ల సెక్షన్ నెగెటివ్ విమర్శలతో నిండిపోయింది. మానసిక స్థితి బాగో లేదనుకుంటా అని ఒకరు.. ఎందుకు అలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ అని ఇంకొకరు కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు. తుం‘టి కొడితే పళ్ళు ఉడినట్టు నాగ చైతన్య పెళ్ళి చేసుకుంటే నీ మొగుడు ఎందుకు వీడియో చేశాడు.. నీ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోయింది అని ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు.
నాగ చైతన్య… నాకు గిఫ్ట్ కావాలి: వేణు స్వామి భార్య వీణ డిమాండ్ pic.twitter.com/r9STpVxFI7
— ChotaNews (@ChotaNewsTelugu) August 13, 2024