Venu Thottempudi : వేణు తొట్టెంపూడిని మోసం చేసిన బోయపాటి శ్రీను.. అలా చెప్పి ఇలా చేశాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Thottempudi : వేణు తొట్టెంపూడిని మోసం చేసిన బోయపాటి శ్రీను.. అలా చెప్పి ఇలా చేశాడా?

 Authored By prabhas | The Telugu News | Updated on :30 July 2022,12:40 pm

Venu Thottempudi : కథలు వినిపించడం గురించి అందరికీ తెలిసిందే. కథలు చెబుతున్నావా? అని వేలాకోలంగా అంటుంటాం కదా? అలానే కొందరు దర్శకులు కూడా కథలు వీర లెవెల్లో నెరేట్ చేస్తారు. నటీనటులు, హీరోల దగ్గరకు వెళ్లి తమ తమ కథలను చెబుతుంటారు. అయితే కథలు చెప్పేటప్పుడు, చెప్పిన దాన్ని తీసేటపప్పుడు ఎంతో తేడా కనిపిస్తుంటుంది. ఇక పాత్రలు నెరేట్ చేసేందుకు వెళ్లినప్పుడు దర్శకులు కాస్త అతి చేస్తుంటారు. మీ పాత్రే గ్రేట్.. అద్భుతంగా, అదుర్స్ అంటూ పొగిడేసి చెబుతుంటారు. మొత్తానికి పాత్రను ఒప్పుకునేలా చేస్తారు.

కానీ తీరా సినిమా చూస్తే.. తేడా కొట్టేస్తుంటుంది. అలా తనను బోల్తా కొట్టించిన బోయపాటి శ్రీను గురించి వేణు తొట్టెంపూడి సంచలన విషయాలు బయటపెట్టేశాడు. వేణు చాలా ఏళ్ల తరువాత రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే బోయపాటి మీద కామెంట్స్ చేశాడు. షోలోలే అమితాబ్ లాంటి పాత్ర నీది.. అని ద‌మ్ములో వేణుని తీసుకొన్నాడ‌ట బోయ‌పాటి.

venu Thottempudi about boyapati Srinu Dammu Movie

venu Thottempudi about boyapati Srinu Dammu Movie

ఇక సినిమా చూసిన వారికి వేణు పాత్ర ఏ పాటిదో అందరికీ తెలిసిందే.ఎడిటింగ్ లో చాలా సీన్లు లేచిపోయాయట. ‘షోలేలో అమితాబ్ పాత్ర అన్నారు. తీరా చూస్తే ఏం జ‌రిగిందో మీకు తెలుసు. ఆ సినిమాలో అమితాబ్ చ‌నిపోయిన‌ట్టు.. ద‌మ్ములో నేను చ‌నిపోతాను. ఈ రెండు సినిమాల మ‌ధ్య పోలిక అదొక్క‌టే’ అని త‌న‌పై త‌నే సెటైర్ వేసుకొన్నాడు. అయితే ఆ సినిమా చేసినందుకు ఎప్పుడూ ప్ర‌శ్చాత్తాప‌ప‌డ‌లేద‌ని చెప్పాడు. మొత్తానికి దర్శకులు ఎలాంటి మాయమాటల్ని చెప్పి నటీనటుల్ని బురిడీ కొట్టిస్తారో ఇదొక ఉదాహరణ.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది