Nagma : అందాల నటి నగ్మా ప్రేమ వ్యవహారాల గురించి ఎవరికి తెలియని నిజాలు…అంత మందితో..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 1, 2022, 7:15 am

Nagma : అలనాటి నటి, చేప కళ్ల సుందరి నగ్మా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నగ్మా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 90ల కాలంలో తెరగేంట్రం చేసి అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి అభినయంతో ఎన్నో ప్రశంసలను పొందారు. టాలీవుడ్‌ స్టార్ హీరోలైన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లతో నటించి మెప్పించారు. వరుస సినిమాలతో భారీ హిట్స్‌ కొట్టిన నగ్మా.. సినిమాలతోనే కాకుండా ఎఫైర్ వార్తలతోను అప్పట్లో వార్తల్లో నిలిచారు.

Nagma : హీరోలతో నగ్మా ఎఫైర్‌ పుకార్లు..!

veteran actress nagma love affairs

veteran actress nagma love affairs

Nagma : ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో నగ్మా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికారు చేసాయి. అంతేకాకుండా శరత్ కుమార్, రవి కిషన్, మరో బాలీవుడ్‌ హీరోతో కూడా ఆమె ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అప్పటికే గంగూలీకి డోనాతో పెళ్లయింది. గంగూలీ – నగ్మా కలిసి అప్పట్లో రహస్యంగా పూజలు కూడా చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎమైందో ఎవరికీ తెలియలేదు. అనంతరం ఆమె బాలీవుడ్ కు చెందిన ఓ హీరోతో పెళ్లికి సిద్ధమయ్యారనే టాక్‌ నడిచింది. సదరు హీరో.. తన భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడట. అయితే ఇంతలోనే మ‌న‌స్ప‌ర్థ‌లు రావడంతో వీరిద్దరు కూడా విడిపోయారు. ఇక కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ తో కూడా నగ్మా ప్రేమాయణం నడిపిన ప్రచారం అప్పట్లో బలంగా వినిపించింది. ఆ తర్వాత శరత్ కుమార్‌తో కూడా నగ్మాకు బ్రేకప్ అయింది. ఇలా ప్ర‌స్తుతం 47 సంవత్సరాల వయసులో ఉన్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఆమె ఒంటరిగానే ఉంటోది.

తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్’ ‘అల్లరి అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ ‘వారసుడు’ ‘మేజర్ చంద్రకాంత్’ ‘భాషా’ ‘ప్రేమికుడు’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. అప్పట్లో అరేబియన్ గుర్రం వంటి నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. ఒకప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ, భోజ్‌పురి భాష‌లోనూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది నగ్మా. మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు – మేజర్ చంద్రకాంత్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 2008లో భోజ్‌పురిలో సినిమాల్లో మాత్రమే ఆమె చివరిసారిగా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నగ్మా ఇక్కడ కూడా సక్సెస్ కాలేదు.

Also read

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp