Bigg Boss OTT Telugu : వాళ్ల గుట్టు రట్టు చేసిన సరయు… కేవలం వారి వల్లే బయటకు వచ్చానంటూ కామెంట్
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ షోతో పాపులారిటీ దక్కించుకున్న వారిలో సరయు ఒకరు. సరయు అంటే బూతు.. బూతు అంటే సరయు.. అనేట్టుగా ‘7 ఆర్ట్స్’ యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు వదులుతూ ఉంటుంది సరయు. డబుల్ మీనింగ్‌లు ఏం లేవు.. అంతా డైరెక్ట్ మీనింగే అనేట్టుగానే ఇందులోని సంభాషణలు ఉంటాయి.పలు వివాదాలతో ఎప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పీఆర్ వ్యవస్థపై మండిపండింది .కేవలం పీఆర్ టీంల వల్లే తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశానంటూ వాళ్ల గుట్టు బయటపెట్టింది సరయు. నేను నిజాలు చెప్తే అందరికీ కోపాలు వచ్చేస్తాయి.. గట్టిగా ఎవరికైతే పీఆర్ ఉంటుంది.. వేరే వాళ్లని మైనస్ చేసే పీఆర్ ఎవరికైతే ఉంటుందో..
వాళ్లు బిగ్ బాస్ ఆటలో ముందు వెళ్తారు.బిగ్ బాస్ షోలో మనకు చూపించేది గంట మాత్రమే. దాన్ని బట్టి నెగిటివ్‌గా వెళ్తున్నారా? లేదంటే పాజిటివ్‌గా వెళ్తున్నారా? అన్నది ఎలా తెలుస్తుందంటే.. బయట ఉన్న పీఆర్ఓలు అంతా.. బీభత్సమైన ప్రచారం చేస్తారు. వాళ్లు సపోర్ట్ చేసే కంటెస్టెంట్‌కి వ్యతిరేకంగా ఉన్న వాళ్లని నెగిటివ్ చేసేస్తారు. పీఆర్ పని అదే. ఇంతకు ముందు బిగ్ బాస్‌లో ఇలా ఉండేది కాదు.. ఈ మధ్యనే అలా అవుతుంది. బిగ్ బాస్‌కి వెళ్లే ముందే పీఆర్వోలను పెట్టుకోవడం.. వాళ్లతో నెగిటివ్ పబ్లిసిటీ చేయించడం చేస్తున్నారు. ఇది వాస్తవం. పాజిటివ్ అవ్వకపోయినా పర్లేదు కానీ.. ఎదుటివాళ్లని నెగిటివ్ చేయాలని మాత్రం చూస్తారు. నేను కూడా బాధితురాలినే.పీఆర్ టీం వల్లనే రెండు సార్లు ఎలిమినేట్ అయి బయటకు వచ్చాను అని చెప్పుకొచ్చింది సరయ. అయితే ఈ వ్యాఖ్యలను స్రవంతి ఖండించింది.
victed contestant sarayu fires on bigg boss non stop telugu pr system
Bigg Boss OTT Telugu : బాధ చెప్పుకున్న సరయు..
టాలీవుడ్‌లో పాపులర్ పీఆర్ఓ ఏలూరు శ్రీను. నాకు సపోర్ట్ చేశారు.. మరి నేను ఎందుకు విన్ కాలేదని స్రవంతి ప్రశ్నించడంతో.. సరయు కౌంటర్ ఇచ్చింది. ‘అంటే.. పీఆర్ టీంలో ఫేక్ పబ్లిసిటీ.. నెగిటివిటీ చేయడం లేదని అంటావా? అని అడిగింది. దీంతో స్రవంతి.. నెగిటివిటీ ఉంది కానీ.. పీఆర్ టీంలతోనే ముందు వెళ్తున్నారంటే కరెక్ట్ కాదు.. అలా అనుకుంటే నేను విన్నర్ అవ్వాలి కదా అని అన్నది.దానికి స్పందించిన సరయు.. ఏలూరు శీనుతో నేను పని చేశా. ఆయన నిన్ను ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలా అని అనుకున్నారు తప్పితే.. వేరే వాళ్లని బ్యాడ్ చేయాలని అనుకోలేదు. నా విషయంలోనే ఏమైంది.. నన్ను అరియానా బాడీ షేమింగ్ చేసింది.. నేను ఏడిస్తే నన్ను బ్యాడ్ చేసి బయటకు పంపారు అంటూ తన బాధ చెప్పుకుంది సరయు.