Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో సీక్రెట్ స్మోకింగ్.. అసలు విషయం చెప్పిన టైటిల్ విన్నర్
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్‌స్టాప్ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా 84 రోజుల పాటు ఆసక్తికరంగా నడిచిన విషయం తెలిసిందే.ఈ షోలో 24 గంటలు హౌస్‌లో ఏం జరిగిందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేయండంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మొదలుపెట్టారు. విచిత్రంగా బిగ్‌బాస్ షోలో లేనన్ని గొడవలు ఈ ఓటీటీలో చోటు చేసుకున్నాయి. ప్రేమలు, ఆప్యాయతల కంటే గొడవలతోనే కంటెస్టెంట్లు ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి ఈ ఓటీటీ మొదటి సీజన్‌లో మొత్తం 18 మంది పాల్గొన్నారు. రీసెంట్‌గా జరిగిన ఫినాలేలో నాగార్జున బిందును విన్నర్‌గా ప్రకటించాడు. అఖిల్ సార్థక్ రన్నర్‌గా నిలిచాడు. యాంకర్ శివ సెకండ్ రన్నరప్ స్థానానికి పరిమితమయ్యాడు.తెలుగులో ఆవకాయ బిర్యాని అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బిందుమాధవి ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేసింది.
అయితే ఆమెకు స్టార్ హోదా దక్కకపోవడంతో పాటు తమిళంలో అవకాశాలు రావడంతో అటు వెళ్ళిపోయింది. అలా తమిళ సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటూ ఆమె ముందుకు వెళ్ళింది. అయితే మధ్యలో ఒక బ్రేక్ అప్ కూడా జరగడంతో ఆమె సినీ పరిశ్రమకు కొంచెం దూరం జరిగింది. తమిళంలో ఒక బిగ్ బాస్ షోలో పాల్గొన్న టాప్ 5 కంటెస్టెంట్ గా ఫినాలే వరకు వెళ్ళింది కానీ కప్పు కొట్టలేకపోయింది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వర్షన్ నాన్ స్టాప్ సీజన్ వన్ లో మాత్రం విజేతగా నిలిచింది.హౌజ్‌లో అన్ని కెమెరాలు ఉన్నా ఆ కెమెరాలకు కూడా కనపడకుండా అషు రెడ్డి, బిందుమాధవి సిగరెట్ తాగారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మిగతా కంటెస్టెంట్ లు.
Bigg Boss OTT Telugu : నిజం బయటపెట్టింది..
అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయి, బాత్రూంలో కూడా సిగరెట్ వాసన వస్తోందని నట్రాజ్ మాస్టర్ కూడా పెద్ద ఎత్తున రచ్చ చేశారు.బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన సమయంలోనూ అషూకు సిగరెట్ తాగావా? అన్న ప్రశ్న ఎదురైంది. కానీ అషూ తెలివిగా దాని నుంచి తప్పించుకుంది. తాజాగా ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో సరదాగా చిట్‌చాట్ చేసిన బిందుమాధవికి సైతం అదే ప్రశ్న ఎదురైంది. నువ్వు స్మోకింగ్ చేస్తున్నావని స్రవంతి.. అఖిల్‌తో పాటు అతడి ఫ్రెండ్స్‌కు చెప్పింది. అది నిజమేనా? అని ఓ అభిమాని అడిగారు. దీనికి బిందు స్పందిస్తూ.. తానసలు పొగ తాగలేదని స్పష్టం చేసింది. తనకా అలవాటు ఉండుంటే ఓపెన్‌గానే స్మోకింగ్ చేసేదాన్నని చెప్పుకొచ్చింది.