Vidya Balan: నిర్మాత చేసిన ప‌నికి నా ముఖం అద్దంలో చూసుకోలేక‌పోయానంటూ విద్యా బాల‌న్ సంచ‌ల‌న కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vidya Balan: నిర్మాత చేసిన ప‌నికి నా ముఖం అద్దంలో చూసుకోలేక‌పోయానంటూ విద్యా బాల‌న్ సంచ‌ల‌న కామెంట్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :22 March 2022,10:00 pm

Vidya Balan : డర్టీ పిక్చ‌ర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ విద్యా బాలన్. ఈ అమ్మ‌డు బీటౌన్ లో స్పెషల్ సినిమాలకు పెట్టింది పేరు . హీరోయిన్‌ గా కెరీర్ స్టార్ట్ చేసినా విద్య లేడీ ఒరియెంటెడ్‌ మూవీస్.. బయోపిక్‌ సినిమాలతో ఇండస్ట్రీలో తకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సిల్క్‌ స్మిత బయోపిక్‌ ది డర్టీ పిక్చర్‌ మూవీతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది విద్యాబాలన్. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది సీనియర్ స్టార్ హీరోయిన్.స్టార్ హీరోయిన్లు కూడా చేయలేని పాత్రలను చేసి అందరిచేత శబాష్ అనిపించుకుంది విద్యా. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అమ్మడు బాడీ షేమింగ్ ఎదుర్కొని, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది.

విద్యా బాల‌న్ తాజాగా న‌టించిన చిత్రం జల్సా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో కష్టాలు బడ్డానంటూ విద్యా బాలన్‌ భావోద్యేగానికి లోనయ్యింది. ‘మొదట్లో ఓ నిర్మాత నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. నన్ను బాడీ షేమింగ్‌ చేస్తూ అసహ్యంగా చూసేశాడు. అతని ప్రవర్తల వల్ల నేను 6 నెలల పాటు అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడ్డాను అని చెప్పుకొచ్చింది విద్యా బాల‌న్2003లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వ‌ల‌న తాను ఏసినిమాలకు సంతకం చేయలేకపోయానంటోంది. సినిమాలు చేయాలనుకున్న కుదరలేదు.

vidya balan comments about producer

vidya-balan comments about producer

Vidya Balan : విద్యా బాల‌న్ స్ట‌న్నింగ్ కామెంట్స్..

అంతలా ఆ నిర్మాత తీరు తనపై ప్రభావం చూపింది అంటూ చెప్పుకొచ్చింది.అదే సమయంలో కె బాలచందర్‌ దర్శకత్వంలో రెండు సినిమాలకు సంతకం చేశానని,కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ఆ ప్రాజెక్ట్స్‌ నుంచి తనని తొలగించారని చెప్పింది. అంతేకాదు యాడ్స్ చేసుకుందామంటే.. అందులోనుంచి కూడా తనను తీసేశారంది. అప్పుడు ఈ సంఘటనలు తనని తీవ్రంగా బాధించాయని, చాలా ఏడ్చానని విద్యా పేర్కొంది. అదే బాధలో మెరైన్‌ డ్రైవ్‌ నుంచి బాంద్రా వరకు నడుచుకుంటూ వెళ్లానని ఆమె అన్నారు. అలా తనని దాదాపు 13 సినిమాల నుంచి తీసివేశారని విద్యా బాలన్‌ తెలిపింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది