Nayanthara – Vignesh Shivan : నయనతార సరోగసి పిల్లల వార్తలపై స్పందించిన విఘ్నేష్ శివన్…!

Authored By mallesh | The Telugu News | Updated on : 26 October 2022, 1:20 pm

Nayanthara – Vignesh Shivan : నయన్ విఘ్నేశ్ దంపతులు సంతోషంగా ఉన్నారు. సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన వీరు కొత్తచిక్కుల్లో పడ్డారని, కొత్తగా వివాహమైన సంతోషం కూడా లేదని ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అది చూసిన వారంతా వీరిద్దరి గురించి చాలా ఆందోళన వ్యక్తం చేశారు.కానీ బయట అనుకున్నంతగా నవదంపతులపై ఎటువంటి ప్రభావం పడలేదని ఈ ఫోటో చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. నయనతార ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. నాలుగు పదుల వయస్సు దాటినా నయన్‌కు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.

అటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బడా హీరోలకు హీరోయిన్ కావాలంటే నయన్ మాత్రమే కనిపిస్తోంది. మిగతా వారు పెద్ద హీరోలతో కలిసి నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఇక నయనతార తన జీవితంలో వచ్చిన సమస్యలను అధిగమించి ప్రస్తుతం ఈ స్థానానికి చేరుకుంది. హీరో శింబు, ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత విఘ్నేశ్‌తో నయన్ తన జీవితాన్ని పంచుకుందుని రీసెంట్‌గా తెలిసింది. ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరు ముందే ఒకసారి పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల కిందట పెద్దల సమక్షంలో మరోసారి ఒక్కటయ్యారు.

Vignesh Sivan reacts to Nayanthara surrogate childs

Vignesh Sivan reacts to Nayanthara surrogate childs

Nayanthara – Vignesh Shivan : మేమిద్దరం మాకిద్దరు..

తీరా సరోగసీ ద్వారా పిల్లలను పొందిన వీరికి న్యాయపరమైన చిక్కులు రావడంతో పాటు ఇండస్ట్రీలో పలువురు విమర్శించడం మొదలెట్టారు. ఎట్టకేలకు నయన్ తనకు పిల్లలు పుట్టరని సర్టిఫికేట్ సమర్పించి విచారణ నుంచి విముక్తి పొందినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నయన్ దంపతులు తమ కవలలతో కలిసి సోమవారం సంతోషంగా దివాళీ జరుపుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, మొన్నటివరకు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నయన్ మళ్లీ వేగంగా సినిమాలకు సైన్ చేస్తున్నదని తెలిసింది.

Advertisement

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి