Nayanthara – Vignesh Shivan : నయనతార – విఘ్నేష్ శివన్ ల ప్రేమ కథ లో మరొక ఫ్యూజ్ ఎగిరే న్యూస్ !
Nayanthara – Vignesh Shivan : మొన్నటి వరకు సమంత – నాగ చైతన్య జంట తెగ వార్తలలో నిలవగా, ఇక ఇటీవల నయనతార విఘ్నేష్ శివన్ జంట నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. పెళ్లి, పిల్లలు వంటి వార్తలతో ఈ జంట పేరు మీడియాలో నానుతూ వస్తుంది. ఇటీవల ఈ జంట ఇద్దరు మగ పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఇలా సరోగసీ పద్ధతిలో పిల్లలను కనటం అనేది వారికి కొత్త ఇబ్బందులను తెచ్చి పెట్టింది. ఈ వివాదంపై విచారణ చేయటానికి ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వారు చాలా రోజుల క్రితమే పెళ్లి అయిందని సర్టిఫికెట్స్ అందించారు.
దీంతో ఈ వివాదం ముగిసినట్టే అనిపించింది. అయితే వీరి ప్రేమ కథ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. శింబు, ప్రభుదేవాల నుండి విడిపోయిన తర్వాత నయనతార విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారట.అయితే మొదటి అడుగు పడింది 2015లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం నానుమ్ రౌడీ దాన్ కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమ పుట్టిందట. అసలు ఈ సినిమాలో మొదల నయనతార హీరోయిన్‌గా ఎంపిక కాలేదట ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే అనుకోకుండా ఒక హోటల్లో నయనతారను కలవడంతో ఈ సినిమాకు హీరోయిన్గా నయనతార ఎంపిక చేస్తే బాగుంటుందని భావించి ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేశారట.

Nayanthara and Vignesh Shivan intresting love story news
Nayanthara – Vignesh Shivan : ఇది అసలు ట్విస్ట్..
నానుమ్ రౌడీ దాస్ సినిమా విడుదల ఏడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విగ్నేష్ సెట్లో ఉన్న వీడియోను పంచుకోవడం జరిగింది. ఆ వీడియోలో విఘ్నేష్, నయనతార సముద్రం వద్ద ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి ఓ సినిమా ఈ జంటని కలపడం, పిల్లలకు జన్మనిచ్చేలా చేసిందని చెప్పాలి. నయన్, విఘ్నేశ్ ప్రేమ, పెళ్లి డాక్యుమెంటరీగా వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ పేరుతో తీసుకురాబోతుంది. నయన్ పెళ్లిని డాక్యుమెంటరీగా తీసుకువచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంలో చెల్లించిందట.