Home » Entertainment » Vijay Devarakonda And Rashmika Mandanna Love Story
Entertainment

Vijay – Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లికి రెడీ.. ఇదే సాక్ష్యం అంటున్న ఫ్యాన్స్‌..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 14, 2023, 9:40 am
Advertisement

Vijay – Rashmika : రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా కెరీర్ ఏమాత్రం సరిగా లేదు. అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాల తర్వాత ఇప్పటి వరకు కమర్షియల్‌ హిట్ ను దక్కించుకోలేక పోయాడు. గత ఏడాది వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు కూడా వరల్డ్‌ ఫేమస్ లవర్ సినిమా తో నిరాశ పర్చాడు. ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది. దాంతో ఈయన సినిమాలంటే జనాలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాంతో కెరీర్‌ చాలా డల్ గా సాగుతోంది.

Advertisement

Vijay Devarakonda and Rashmika Mandanna Love Story

ఈ సమయంలోనే రష్మిక మందన్నా తో ఈయన ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా పెద్ద ఎత్తున వీరి ప్రేమ వ్యవహారం గురించి చర్చ జరుగుతోంది. ఆ మధ్య రష్మిక మేము కేవలం స్నేహితులం మాత్రమే అన్నట్లుగా కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ తో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లిన విషయం తెల్సిందే. మొదట ఆ ట్రిప్ ను ఒప్పుకోని రష్మిక మందన్నా ఆ తర్వాత నిజంగానే తాము మాల్దీవ్స్ కి వెళ్లినట్లుగా ఒప్పుకుంది. దాంతో అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటూ చర్చ మొదలు అయ్యింది.

Advertisement

Vijay Devarakonda and Rashmika Mandanna Love Story

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కుటుంబ సభ్యులతో కూడా రష్మిక మందన్నా చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవలే రష్మిక యొక్క సొంత ప్రాంతానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఒక వేడుకలో విజయ్‌ దేవరకొండ కుటుంబ సభ్యులు పాల్గొన్నారట. దాంతో త్వరలోనే రష్మిక మందన్నా మరియు విజయ్ దేవరకొండ యొక్క పెళ్లి జరగబోతుందని.. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి ప్రేమ గురించి అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ ఇరు కుటుంబాలు కలవడంతో ప్రేమ నిజమే అంటూ కొందరు గట్టిగా వాదిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి