Liger Movie : తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’తో హీరోగా మారేముందు విజయ్ పలు చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ‘గీత గోవిందం’, ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని సంపాదించు కున్నాడు. ప్రస్తుతం లైగర్ అనే సినిమా చేస్తుండగా, ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తప్పక హిట్ అవుతుందని అందరు ఆశిస్తున్నారు. అయితే వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న విజయ్ కి ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి, దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
తాజాగా లైగర్ టీం ముంబై మీడియాతో ముచ్చటించింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. ఫైనల్ టచ్ కు రెడీ అయ్యారు టీమ్.. ఈ సందర్భంగా ఓ విలేకరి నుంచి విజయ్‌కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒకవేళ లైగర్ ఫ్లాప్ అయితే…? పరిస్థితి ఏంటీ అని ఆ రిపోర్టర్ అడిగారు. దాంతో విజయ్ కోపంతో ఊగిపోతారని అందరూ భావించారు. కాని అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇలాంటి చిన్న విషయాలకు కోపంతో ఊగిపోనవసరం లేదు. ఇదే ప్రశ్న నన్ను కొన్నేళ్ల కిందట అడిగి ఉంటే కోపంతో ఊగిపోయేవాడిని.. కాని ఇప్పుడు అలా కాదు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అన్నారు. అప్పుడు నాకు కోపం చాలా ఎక్కువ. కానీ గత కొన్ని రోజులుగా నాకసలు కోపమే రావడం లేదు. ఎందుకంటే అభిమానులు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది.
Vijay Devarakonda Answer If Liger Movie Will Flop
ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని వారిని అవమాన పరచలేను.. అని షాకింగ్ కౌంటర్ ఇచ్చారు రౌడీ హీరో. లైగర్ చిత్ర ప్రమోషన్ కోసం దేశమంతా తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా.. ఆడియన్స్ అభిమానం చూపిస్తున్నారు. నన్ను తమవాడిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లిన ప్రేమను చూపిస్తున్నారు. వారి కలిసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకే అన్ని సిటీస్ కు వెళ్లి ప్రమోషన్స్ చేశాం అని తెలివిగా సమాధానం చెప్పారు విజయ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై సంయుక్తంగా పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. మిక్స్డ్మార్షల్ఆర్ట్స్మూవీగా రూపొందిన ఈ మూవీ తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.