Categories: NewsTechnology

Flipkart : ఫ్లిప్‌ కార్ట్ ఎల‌క్ట్రానిక్ సేల్ ప్రారంభం.. టాప్ 10 ఫోన్స్ ఇవే..!

Flipkart : ప్ర‌ముఖ సంస్థ‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఆఫ‌ర్స్‌తో వినియోగ‌దారుల‌ని ఆక‌ర్షిస్తున్న విష‌యం తెలిసిందే. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూసేవారికి గుడ్‌న్యూస్. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తాజా ‘ఎలక్ట్రానిక్స్ సేల్’ పేరుతో స్పెషల్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ సేల్‌లో వివిధ రకాల స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆగస్టు 21న ప్రారంభమైన ఈ సేల్ ఆగస్టు 25 వరకు కొనసాగుతుంది. కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు మరిన్ని కేటగిరీల్లోని ప్రొడక్ట్‌లపై ఆఫర్‌లను పొందవచ్చు. ఐఫోన్ 12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23, మోట్రోలా జీ 52, ఐఫోన్ 13 సహా మరిన్నింటిలో డీల్‌లు అందుబాటులో ఉన్నాయి ఆపిల్ ఐఫోన్ 12 భారీ తగ్గింపు ధరతో వస్తోంది.

Flipkart : మంచి ఆఫ‌ర్స్..

2021లో ఇదే ఐఫోన్ 12 ధర తగ్గింది. ఇదే ఐఫోన్ రూ. 65,900కి అందుబాటులోకి వచ్చింది. కానీ, ఇప్పుడు రూ.53,999 ప్రారంభ ధరతో ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో అందుబాటులోకి వచ్చింది. అంటే కస్టమర్లకు రూ.11,901 తగ్గింపు ధరతో లభిస్తోంది. ఐఫోన్ 12 పాత స్మార్ట్‌ఫోన్ (64GB స్టోరేజ్ మోడల్) తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23 ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో రూ. 17,499 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,999 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 5G స్మార్ట్‌ఫోన్, స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్‌తో వస్తోంది. 5,000mAh బ్యాటరీ, 50-MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.6-అంగుళాల స్క్రీన్, మరిన్ని ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ బాక్సులో ఛార్జర్‌ను అందించడం లేదు. ఇందుకోసం ఛార్జర్ విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. Samsung 25W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ అందిస్తోంది. మోటరోలా G52 అసలు ధర రూ. 14,499కి అందుబాటులో ఉంది

Flipkart Electronic Sale is Live Now.. Special Offers

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ సందర్భంగా ఐఫోన్ 13 ఆన్‌లైన్‌లో కేవలం రూ.73,999కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 వాస్తవానికి రూ.79,900కి లాంచ్ అయింది. ఫ్లిప్ కార్ట్ సేల్ ద్వారా ఐ ఫోన్ 13పై రూ. 5,901 డిస్కౌంట్ పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే కొనుగోలుదారులు Realme C11 (2021) మోడల్‌ను తీసుకోవచ్చు. ఎందుకంటే.. ఇది ఎంట్రీ-లెవల్ ఫోన్, ఫ్లిప్‌కార్ట్‌లో పాత ధర రూ.7,499కి విక్రయిస్తోంది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే ధర రూ. 6,950 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. మీరు అన్ని ఆఫర్‌లతో రియ‌ల్ మీ C11ని కొంచెం తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మోటో జీ 32 ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 11,999 తగ్గింపు ధరతో పొందవచ్చు. SBI బ్యాంక్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపు కూడా ఉంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago