
Vijay Devarakonda : పబ్లిక్‌లో పచ్చి బూతులు మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ఇక నువ్వు మారవా అంటూ ట్రోలింగ్
Vijay Devarakonda : రౌడీ బాయ్‌గా అభిమానుల మనసు గెలుచుకున్న విజయ్ దేవరకొండ ఇటీవలి కాలంలో ఎక్కువగా విమర్శల బారిన పడుతున్నాడు. చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నాడని, నోరు జారుతున్నాడని పలు సందర్భాలలో ఆయనపై విమర్శలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన పబ్లిక్ లో బూతులు మాట్లాడుతూ కెమెరాలకి అడ్డంగా దొరికాడు. దీంతో విజయ్ దేవరకొండని ఓ రేంజ్‌లో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. వివరాలలోకి వెళితే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రలో మునిగి తేలాడు. ఆటిట్యూడ్, లిప్ లాక్ సన్నివేశాలు, రొమాన్స్ ఇలా ప్రతి దాంట్లో కూడా ఆయన అదరహో అనిపించాడు.
అయితే ఈ సినిమా తర్వాత విజయ్‌కి మళ్లీ ఆ రేంజ్ పాపులారిటీ తెచ్చిపెట్టిని సినిమా లేదు. చివరిగా లైగర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంతో పలకరించబోతున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుండగా, కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్రని రిప్రజెంట్ చేసేలా ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ బైక్‌పై వచ్చాడు. వెనక హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ని కూర్చోపెట్టుకొని వచ్చాడు.
అయితే విజయ్ దేవరకొండ వస్తున్న సమయంలో అభిమానులు ఆయనని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ అడ్డుకుంటున్నా కూడా బైక్‌కి అడ్డంగా కొందరు అభిమానులు వస్తుండడంతో విజయ్ దేవరకొండ సహనం కోల్పోయి.. ‘అరె జరగండ్రా నీ యబ్బా’ అని గట్టిగా అరిచాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. అభిమానులను అలా పబ్లిక్ లో తిట్టడం ఏమిటంటూ విజయ్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే అనవసరంగా లేని పోని వివాదాలలో ఇలా విజయ్ చిక్కుకొని తన క్రేజ్ తగ్గించుకుంటున్నాడని కొందరు ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రంతో మంచి హిట్ దక్కించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక పోతే ఫ్యామిలీ స్టార్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.