Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అంటే ఆ అమ్మాయికి అంత పిచ్చెందుకు.. ఏం చేసిందో తెలిస్తే నోరెళ్లపెడతారు..!
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ..ఈ హీరో గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అర్జున్ రెడ్డి మూవీ సూపర్ హిట్‌తో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ భారీ ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ యంగ్ హీరో అంటే పిచ్చెక్కిపోతారు. తమ అభిమాన హీరో పేరుని లేదంటే ఆయన ఫొటోలని టాటూలుగా వేయించుకుంటున్నారు. తాజాగా ఇద్దరు అమ్మాయిలు విజయ్ దేవరకొండను కలిసి తెగ సంతోష పడిపోయారు. వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి రౌడీ హీరో ఎంతో అప్యాంగా మాట్లాడారు. పూరి జగన్నాథ్‌ను లైగర్ సినిమా గురించి ఏమైనా అడగాలంటే అడగండి అని వారికి సూచించారు.
డాక్టర్ చెర్రీ అనే అమ్మాయి వీపుపై విజయ్ టాటూను చూపించింది. అనంతరం వారితో సరదాగా ముచ్చటించి.. ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు విజయ్. ఇందుకు సంబంధించిన వీడియోను విజయ్ దేవరకొండ టీమ్ ట్వీట్టర్‌లో షేర్ చేసింది. సూపర్ ఫ్యాన్ మూమెంట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో లైగర్ మూవీ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆగస్టు 25న ‘లైగర్’ను ఆడియన్స్ ముందుకురానుంది.

vijay devarakonda fan moment video viral
Vijay Devarakonda : విజయ్‌పై లవ్..
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించగా.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీ రోల్ పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ ఫ్యాన్స్ అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మూవీ యూనిట్ బిజీగా ఉంది. మరొవైపు సమంతతో కలిసి ఖుషీ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక పూరీ, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. జనగణమన అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
