Vijay- Rashmika | విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ వార్త‌ల న‌డుమ‌ స్పందించిన రష్మిక | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijay- Rashmika | విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ వార్త‌ల న‌డుమ‌ స్పందించిన రష్మిక

 Authored By sandeep | The Telugu News | Updated on :6 October 2025,1:00 pm

Vijay- Rashmika | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమ వ్యవహారంపై అనేక వార్తలు వస్తుండగా, విదేశాల్లో కలిసి కనిపించిన ఫొటోలు మరింత అంచనాలను పెంచేశాయి. తాజాగా వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో, కుటుంబ సభ్యుల మధ్య ఇది ఘనంగా జరిగిందని ఓ వర్గం చెబుతోంది. అయితే, ఇప్పటికీ విజయ్ – రష్మిక నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

#image_title

రష్మిక వైరల్ పోస్ట్

ఈ నేపథ్యంలో, రష్మిక మందన్న తాజాగా తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. “ఇది పూర్తిగా అనుకోకుండా తీసుకున్న నిర్ణయం…” అంటూ మొదలైన ఈ పోస్టుపై చాలా మంది ఇది ఆమె ఎంగేజ్‌మెంట్‌ గురించి కావచ్చని ఊహించారు. కానీ ఆ పోస్ట్ అసలేమిటంటే – ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన రష్మిక కొత్త చిత్రం ‘థామా’ నుండి విడుదలైన ‘నువ్వు నా సొంతమా’ అనే సాంగ్ గురించి.

ఆ సినిమా దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కానుంది. సాంగ్ షూటింగ్ అనుకోకుండా తీసుకున్న నిర్ణయం వల్లే జరిగింది అని రష్మిక తెలిపారు. ‘‘అక్కడ లొకేష‌న్ చాలా అందంగా ఉంది. చివరి రోజు షూటింగ్ సందర్భంగా, అక్కడే ఓ రొమాంటిక్ సాంగ్ చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలకి ఆలోచన వచ్చింది. వెంటనే అందరం రిహార్సల్స్ చేసి, మూడు నాలుగు రోజుల్లో పాటను చిత్రీకరించాం. పాట ఫలితం చూస్తే మేము ఆశ్చర్యపోయాం’’ అని చెప్పుకొచ్చింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది