Home » Entertainment » Vijay Devarakonda Interesting Comments On Jr Ntr
Entertainment

JR NTR : ఎన్టీఆర్‌కి ఆస్కార్ వ‌స్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండ షాకింగ్ కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Published on: August 20, 2022, 10:00 pm
Advertisement

JR NTR : లైగ‌ర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవ‌తారం ఎత్త‌నున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న తెలుగుకే ప‌రిమిత‌మైన విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ ఇప్పుడు రాష్ట్రాలు దాట‌నుంది. లైగ‌ర్ చిత్రం ఆగ‌స్ట్ 25న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీకి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ తాజాగా ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటనకి గాను ఎన్టీఆర్.. ఆస్కార్స్ కి నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ అంచనాలు మొదలయ్యాయి.

Advertisement

JR NTR : విజ‌య్ స్ట‌న్నింగ్ కామెంట్స్..

‘ఆయన ఆస్కార్ అవార్డుల గెలవాలని కోరుకుంటున్నాను.. ముందుకు వెళ్లాలి.. తారక్ అన్నకు ఆస్కార్ రావాలి.. అది మెంటల్ ఉంటుంది.. మన దేశం నుంచి మన వాళ్లు గెలిస్తే ఉండే ఆనందం వేరే. అద్బుతంగా నటించేశారు.. డెడ్లీ పర్ఫామెన్స్.. రామ్ చరణ్ అన్నా, తారక్ అన్నా కిల్లర్ పర్ఫామెన్స్ ఇచ్చారు’ అంటూ విజయ్ దేవరకొండ తన స్టైల్లో చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం విజయ్ దేవ‌రకొండ వ్యాఖ్య‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు విజ‌య్ ని ఆకాశానికి ఎత్తుతున్నారు. కాగా, రూసో బ్రదర్స్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమా విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా ముచ్చటించారు. అయితే కొంతమంది వెస్ట్రన్ ఆడియెన్స్ ఆర్ఆర్ఆర్ మీద సెటైర్లు వేశారు. గే స్టోరీ అంటూ కామెంట్లు పెట్టారు.

Vijay Devarakonda interesting comments on JR NTR

Advertisement

కానీ ఆర్ఆర్ఆర్‌ను మాత్రం అడ్డుకోలేకపోయారు. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ విష‌యానికి వ‌స్తే.. లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లైగర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రంలో ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ పోలికలు ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. కానీ లైగర్ యూనిక్ గా ఉంటుందని.. క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ తెలిపారు. లైగర్ మ్యానియా నెమ్మదిగా జోరందుకుంటోంది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, ఛార్మి ఇలా లైగర్ టీం దేశం మొత్తం తిరుగుతూ తమ చిత్రానికి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవ‌ల వ‌రంగ‌ల్‌లో తెగ సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. ..

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి