Home » Entertainment » Vijay Devarakonda Left That Girl For Samantha
Entertainment

Samantha : సమంత కోసం ఆ అమ్మాయిని వదిలేసిన విజయ్ దేవరకొండ.. ఫుల్ హ్యాప్పీస్..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 4, 2022, 5:40 pm
Advertisement

Samantha : సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేరు. ఇక దానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎగ్జామ్ పుల్ గా అయ్యాడు. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ అయిన లైగర్ ఏ రేంజ్ లో బోల్తా కొట్టిందో మనకు తెలిసిందే . విజయ్ కు అంతకుముందు మంచి పేరు తెచ్చిన అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు వంటి సినిమా ల కంటే ఈ సినిమా పరమ చెత్తగా ఉందంటు కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఒకప్పుడు విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి, రౌడీ హీరో అని పిలిచేవాళ్ళు ఇప్పుడు తన పని అయిపోయినది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం విజయ్ దేవరకొండ నటన మాత్రం కాదు, విజయ్ దేవరకొండ తన పాత్రలో బాగా నటించాడు. కానీ డైరెక్షన్ వలన ఈ సినిమా ఫ్లాప్ అయింది. కాగా ఈ సినిమా భారీ హిట్ అందుకుంటుందని విజయ్ దేవరకొండ పూరి తో మరో సినిమాకు ఓకే చెప్పేశాడట. అయితే లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి . అంతేకాకుండా విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే కెరియర్ అటూ ఇటూ కాకుండా సింగిల్ గా ఉండిపోయింది. అంతేకాకుండా పూజ హెగ్డేను ఏరి కోరి మరి ఈ సినిమాలో పెట్టించుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆమెను పూర్తిగా దూరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay Devarakonda left that girl for Samantha

Advertisement

వీరందరినీ పక్కనపెట్టి ఇదే టైంలో సమంతతో ఎలాగైనా తన నెక్స్ట్ ఫిలిం చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ మరియు సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఖుషి అనే పేరు పెట్టారు. ఇక ఈ సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని మూడో షెడ్యూల్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మూడో షెడ్యూల్ కూడా త్వరలోనే ప్ ప్రారంభం కానుంది అని సమాచారం. ఇక సమంత హెల్త్ బాగోలేదు అయినా సరే విజయ్ దేవరకొండ కెరియర్ నిలబెట్టడానికి ఈ షూటింగ్ చేయడానికి సిద్ధపడిందట. ఇక వీరి అంచనాలు తగ్గట్టు ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అందుకుంటే మాత్రం వీరిద్దరికి కెరియర్ మలుపు తిరిగినట్లే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి