Vijay deverakonda : మ‌ళ్లీ అడ్డంగా దొరికిపోయిన విజ‌య్- ర‌ష్మిక‌.. ఈ సారి ఎక్క‌డ చిక్కారంటే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vijay deverakonda  : మ‌ళ్లీ అడ్డంగా దొరికిపోయిన విజ‌య్- ర‌ష్మిక‌.. ఈ సారి ఎక్క‌డ చిక్కారంటే..!

Vijay deverakonda  :  గ‌త కొద్ది రోజులుగా విజయ్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక వ్య‌వహారంపై సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని తెగ ప్ర‌చారాలు జ‌రుగుతుంటే, వారు మాత్రం మా ఇద్ద‌రి మ‌ధ్య ఏమి లేద‌ని చెప్పుకొస్తున్నారు.రష్మిక-విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకూ చెప్పుకొస్తూనే ఉంది. ఈ జంట మాత్రం దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వ‌డం లేదు. అయితే వారిద్ద‌రు త‌ర‌చు ఒకే […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Vijay deverakonda  : మ‌ళ్లీ అడ్డంగా దొరికిపోయిన విజ‌య్- ర‌ష్మిక‌.. ఈ సారి ఎక్క‌డ చిక్కారంటే..!

  •  గ‌త కొద్ది రోజులుగా విజయ్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక వ్య‌వహారంపై సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

  •  విజయ్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక.. తాజాగా ఈ జంట దుబాయ్‌లో వాలిన‌ట్టు తెలుస్తుంది..."

Vijay deverakonda  :  గ‌త కొద్ది రోజులుగా విజయ్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక వ్య‌వహారంపై సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని తెగ ప్ర‌చారాలు జ‌రుగుతుంటే, వారు మాత్రం మా ఇద్ద‌రి మ‌ధ్య ఏమి లేద‌ని చెప్పుకొస్తున్నారు.రష్మిక-విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకూ చెప్పుకొస్తూనే ఉంది. ఈ జంట మాత్రం దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వ‌డం లేదు. అయితే వారిద్ద‌రు త‌ర‌చు ఒకే ప్లేస్‌కి విడివిడిగా వెళ్ల‌డం అక్క‌డ క‌లుసుకోవ‌డం వంటివి చేస్తూ జ‌నాల‌ని క‌న్ఫ్యూజ్ చేస్తున్నారు. వీళ్లు సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలను చూసి ఇద్దరూ ఒకే చోట ఉన్నారంటూ ఫ్యాన్స్ ప్రూఫ్స్‌తో సహా బ‌య‌ట‌పెట్టిన కూడా వారు మాత్రం త‌మ రిలేష‌న్ షిప్‌పై ఓపెన్ కావ‌డం లేదు
ఇదేదో తేడాగా ఉందే..

ర‌ష్మిక‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ముంబై ఎయిర్‌పోర్టులో ఒకరి తరువాత మరొకరు కనిపించడడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని అంద‌రు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే అప్పుడు అలాంటిదేమి లేద‌ని వారు క్లారిటీ ఇచ్చారు . అయితే తాజాగా ఈ జంట దుబాయ్‌లో వాలిన‌ట్టు తెలుస్తుంది. ర‌ష్మిక బ‌ర్త్ డే సంద‌ర్భంగా అక్క‌డికి వెళ్లిన‌ట్టు టాక్. రష్మిక తాజాగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తే దుబాయ్‌లో ఉన్నట్లు అర్థమైంది. అలానే ఒక నెమలి ఫొటోను షేర్ చేస్తూ బ్యూటిఫుల్ అంటూ రష్మిక స్టోరీ పెట్టింది. ఇక ఇది పెట్టిన కొంత సేప‌టికి విజయ్ దేవరకొండ కూడా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి చెప్పుకుంటూ రాగా, అందులో బ్యాక్ గ్రౌండ్‌లో నెమ‌లి ద‌ర్శ‌నం ఇచ్చింది. ఇక ఈ రెండు స్టోరీల‌ని మ్యాచ్ చేసి చూస్తూ ఇద్ద‌రు కూడా ఒకే ప్లేస్ లో ఉన్నార‌ని అంటున్నారు

ఏప్రిల్ 5న రష్మిక బర్త్‌డే కావడంతో దుబాయ్‌లో వారు పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారట. అందుకే రష్మిక-విజయ్ దుబాయ్ వెళ్లినట్లు స‌మాచారం.ఇక ఇక రష్మిక పుట్టినరోజు నాడే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుండ‌డం, ఈ సినిమాలోను ర‌ష్మిక ఓ పాత్రలో క‌నిపిస్తుంద‌ని వార్త‌లు రావ‌డం చూస్తుంటే త్వ‌ర‌లో వారిద్ద‌రు పెళ్లి చేసుకోవ‌డం ఖాయం అంటున్నారు. రీసెంట్‌గా ర‌ష్మిక … విజ‌య్‌లో న‌చ్చ‌న‌వి, న‌చ్చేవి ఏంటో చెప్పుకొచ్చింది. “విజయ్ కూడా నాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. దీంతో మా ఇద్దరి ఆలోచనలు, చేసే పనులు ఒకేలా ఉంటాయి. ఈ విషయం విజయ్ లో నాకు బాగా ఇష్టం. ఇక నచ్చని విషయం అంటే.. వర్క్ విషయంలో విజయ్ చాలా సీరియస్ గా ఉంటాడు. ఎప్పుడు ఏదొక వర్క్ చేస్తూనే ఉంటాడు. అది నాకు నచ్చదు” అని చెప్పుకొచ్చింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది