Vijay Deverakonda – Rashmika Mandanna : వామ్మో వాయ్యో .. సీక్రెట్ గా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నపెళ్లి ??
Vijay Deverakonda – Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. “ఛలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మీక మందన్న ఆ తర్వాత “గీత గోవిందం” సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించింది. ఆ సినిమాతో రష్మిక కెరియర్ లోనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఆ సినిమా నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత “డియర్ కామ్రేడ్” సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించడంతో ఆ ఊహగానాలు మరింత ఉపందుకున్నాయి. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అని పుకార్లు మొదలయ్యాయి.
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్యన కూడా లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరి పెళ్లి ఫొటో వైరల్‌గా మారింది. ఇది చూసి ఏంటి వారిద్దరి పెళ్లి జరిగిందా అని ముచ్చటించుకుంటున్నారు. చూస్తుంటే ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం జరుగుతుంది. స్టార్ హీరోయిన్ రష్మిక, కన్నడ హీరో రక్షిత్ శెట్టి కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి మొట్ట మొదట కిరిక్ పార్టీ సినిమాలో నటించారు. ఇదే రష్మికకు మొదటి సినిమా…ఇక ఈ సినిమాలో నటించే సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. ఆ తరవాత చాలా కాలం పాటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు.

Vijay Deverakonda and Rashmika Mandanna marriage pic viral
Vijay Deverakonda – Rashmika Mandanna ; పెళ్లి పిక్స్..
అంతే కాకుండా ఇరు కుటుంబాలను ఒప్పంచి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. సినిమా, రాజకీయ ప్రముఖులు నిశ్చితార్థ వేడుకుకు వచ్చారు. ఇక త్వరలో పెళ్లి చేసుకోవాల్సి ఉండగా రష్మిక రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పేసింది. ఇక ఇప్పుడు విజయ్ – రష్మిక మాంచి దోస్తులుగా ఉన్నారు. ఇక రష్మిక రక్షిత్ శెట్టి బ్రేకప్ స్టోరీలో రక్షిత్ శెట్టి ఎంజాయ్ చేసి వదిలించుకున్నాడు అని కూడా రష్మిక ఫ్యాన్స్ చెపుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది మాత్రం రష్మికనే రక్షిత్ శెట్టిని మొదటి సినిమాకు వాడుకుని స్టార్ స్టేటస్ రాగానే వదిలేసిందని మరికొందరి అభిప్రాయం. ప్రస్తుం రష్మిక టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ సినిమాలతో బజీగా ఉంది.