Vijay Deverakonda : దేవరకొండ లైనప్ చూస్తే Goosebumps రా..!
ప్రధానాంశాలు:
Vijay Deverakonda : దేవరకొండ లైనప్ చూస్తే Goosebumps రా..!
Vijay Deverakonda : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్ లేని కథలను ఎంచుకుంటారు. దర్శకులు కూడా సేఫ్ గేమ్ ఆడేవాళ్లే దొరుకుతారు. కానీ, విజయ్ దేవరకొండ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా నిలుస్తున్నాడు. వరుసగా డిజాస్టర్లు ఎదురైనా సరే, తన తదుపరి సినిమాల లైనప్ చూస్తుంటే మాత్రం పక్కాగా గోల్డెన్ ఛాన్స్ అని అనిపిస్తుంది. ఇంత క్రేజీ ప్రాజెక్టులను ఎలా సెట్ చేసుకుంటున్నాడు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Vijay Deverakonda : దేవరకొండ లైనప్ చూస్తే Goosebumps రా..!
విజయ్ ఎంచుకున్న సినిమాలన్నీ హాలీవుడ్ రేంజ్ స్కేల్, భారీ బడ్జెట్ ఉన్నవే. రణబాలి సినిమాను స్వాతంత్ర్యం బ్యాక్ డ్రాప్ లో మైత్రి మూవీ మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీని తాలూకు క్లిప్పులు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న రౌడీ జనార్ధన సినిమాను అవుట్ అండ్ అవుట్ వయొలెంట్ సెటప్ తో పక్కా మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నారు. వీటికి తోడు, హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ అండ్ హిట్ సినిమా ఇచ్చిన శౌర్యువ్ దర్శకత్వంలో మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామాను అనౌన్స్ చేశాడు. ఈ కాంబో చూస్తుంటేనే సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోతుంది. ఈ ప్రాజెక్టులన్నీ చూస్తుంటేనే గూస్ బంప్స్ రావడం ఖాయం.
విజయ్ దేవరకొండకు వచ్చిన ఈ ప్రాజెక్టులన్నీ అతని ప్యాన్ ఇండియా సుడి అని చెప్పుకోవాలి. వరుస ఫ్లాపుల ప్రభావం తనపై పడకుండా, ఇలాంటి భారీ సినిమాలు సెట్ చేసుకోవడం అంటే మాటలు కాదు. వీటిలో ఒక్కటి బలంగా వర్కౌట్ అయినా సరే, నార్త్ ఇండియాలో కూడా విజయ్ కి తిరుగులేని మార్కెట్ దక్కుతుంది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన రౌడీ హీరో, ఇప్పుడు తన ఫుల్ ఫోకస్ అంతా కెరీర్ మీదనే పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు, మరో రెండు భారీ సినిమాలు కూడా డిస్కషన్ స్టేజిలో ఉన్నాయట. ఫ్లాపులు వచ్చినా సరే, తగ్గేదేలే అన్నట్టుగా విజయ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు మరియు అతని లైనప్ నిజంగానే అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ సినిమాలతో విజయ్ మళ్ళీ తన పాత ఫామ్ లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాలని అందరూ కోరుకుంటున్నారు. విజయ్ కెరీర్ లో ఇదే కీలకమైన మలుపు అని చెప్పవచ్చు.