Vijay Deverakonda : కోట్ల రూపాయల ఆస్తిని ఆమె పేరిట రాసిన విజయ్ దేవరకొండ… తండ్రిని కూడా కాదని…!
Vijay Deverakonda : టాలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే వాస్తవానికి విజయ్ టాలీవుడ్ లో ఒక సెన్సేషనల్ గా నిలిచాడు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే విజయ్ దేవరకొండ తన కెరియర్ స్టార్టింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత పెళ్లిచూపులు అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. దాని తర్వాత విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఓవర్ […]
Vijay Deverakonda : టాలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే వాస్తవానికి విజయ్ టాలీవుడ్ లో ఒక సెన్సేషనల్ గా నిలిచాడు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే విజయ్ దేవరకొండ తన కెరియర్ స్టార్టింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత పెళ్లిచూపులు అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. దాని తర్వాత విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో మారాడు. దీంతో అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండకు యూత్ లో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీనితో విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక దాని తర్వాత వచ్చిన గీత గోవిందం ఆయనను స్టార్ హీరోల లిస్టులో చేర్చింది. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందాన కలిసి నటించిన గీత గోవిందం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇలా వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ బిజీ బిజీగా మారిపోయాడు.
అయితే ఆయన ప్రస్తుతం విజయ్ ఒక్కొ సినిమాకి దాదాపు 20 నుంచి 25 కోట్లు రెమ్యూనేషన్ తీసుకుంటున్నారట. అయితే నిజానికి గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు సరైనా హిట్ పడలేదు అయిన కానీ విజయ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక దర్శక నిర్మాతలు కుడా ఆయనతో మూవీ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండకు ఇటు సినిమాలతో పాటు వివిధ వ్యాపారాలు కూడా ఉన్నాయి. రౌడీ పేరుతో ఓ గ్రాన్మెంట్ బ్యాండ్ నడుపుతున్నారు. దానితోపాటుగా పలు నిర్మాణ సంస్థలను కూడా విజయ్ ఏర్పాటుు చేశారు. అలాగే పలు వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా విజయ్ వ్యవహరిస్తున్నారు. ఇక ఇవ్వని చూస్తే విజయ్ దేవరకొండ కోట్లలో సంపాదిస్తున్నట్లుగా అర్థం అవుతుంది.
Vijay Deverakonda : ఆస్తి మొత్తం తల్లి పేరున రాసిన విజయ్…
అంతేకాక రెండుసార్లు పొర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన విజయ్ దేవరకొండ యొక్క ఆస్తి విలువ దాదాపు 70 కోట్లు ఉండవచ్చు అని అంచనా. అయితే ఆయన ఆస్తిలో హైదరాబాదులో లగ్జరీ హౌస్ అలాగే కొన్ని ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇక ఈ ఆస్తి మొత్తాన్ని కూడా విజయ్ దేవరకొండ ఒకరి పేరు మీద పెట్టినట్లు తెలుస్తుంది. అయితే విజయ్ దేవరకొండకు తన తల్లి మాధవి దేవరకొండ అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలోనే తన తల్లి పేరిట విజయ్ దేవరకొండ ఆస్తులు మొత్తం రాసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తన తండ్రి గోవర్ధన్ రావు పేరిట ఎలాంటి ఆస్తులు లేవట. అలా ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అలాగే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా బాగానే రాణిస్తున్నారు.