Vijay Devarakonda – Vishwak Sen : స్టేజిపై విశ్వక్ VS విజయ్ దేవరకొండ హీరోయిన్ లతో డాన్స్ వీడియో..!!

Advertisement

Vijay Devarakonda – Vishwak Sen : తెలుగు చలనచిత్ర రంగంలో సరికొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. మేటర్ లోకి వెళ్తే ఏకంగా సినిమా వేదికలపై హీరో మరియు హీరోయిన్ ఇద్దరు కలిసి డాన్స్ చేయటం ఇటీవల మొదలయ్యింది. విజయ్ దేవరకొండ మరియు సమంత నటించిన ఖుషి సినిమా ఆడియో కన్సర్ట్ ఆగస్టు 15 హైదరాబాద్ లో జరగటం తెలిసిందే. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ స్టేజిపై చొక్కా విప్పేసి సమంతాన్ని గాల్లో ఎత్తుకుని మరి తిప్పి డాన్స్ చేయడం జరిగింది.

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇదిలా ఉంటే సరిగ్గా ఇదే రకంగా విశ్వక్ సేన్, నేహా శెట్టి కలిసి నటించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రమోషన్ కార్యక్రమంలో ఇద్దరు డాన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి హైదరాబాదు మల్లారెడ్డి కాలేజ్ నందు జరిగిన కార్యక్రమంలో నేహా శెట్టి ఏకంగా చీర విప్పేసి.. తన కొంగుతో విశ్వక్ నీ చీరలో దాయటం ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Advertisement
Vijay Devarakonda Samantha And Vishwak Sen Neha Shetty Live Dance Performance
Vijay Devarakonda, Samantha And Vishwak Sen, Neha Shetty Live Dance Performance

అయితే ఈ ఇద్దరు హీరోలు తమ కొత్త సినిమాల ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్లతో వేసిన డాన్స్ పట్ల నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇది సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అనుకుంటున్నారా లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటున్నారా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల నందు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రమోషన్ కార్యక్రమంలో విశ్వక్ హీరోయిన్ నేహా శెట్టి.. బరితెగించి మరి చీర విప్పడం పట్ల మరింతగా నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

Advertisement
Advertisement