Virat Kohli : అనుష్క కాకపోతే కోహ్లీ టాలీవుడ్ బ్యూటీ పెళ్లిని చేసుకోవాల్సిందా ..?
ప్రధానాంశాలు:
Virat Kohli : అనుష్క కాకపోతే కోహ్లీ టాలీవుడ్ బ్యూటీ పెళ్లిని చేసుకోవాల్సిందా ..?
Virat Kohli : భారతదేశంలో క్రికెట్ మరియు సినిమాలపై ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. క్రికెటర్‌లు, నటీమణుల పెళ్లిళ్లు అంటే అభిమానులకు ఒక ఫెస్టివల్‌లా ఉంటుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ జోడీ గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తుంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో మరో వార్త తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే.. కోహ్లీ అనుష్క కంటే ముందు కోహ్లీ తన కెరీర్ ప్రారంభ దశలో తమన్నాతో డేటింగ్ చేశాడట. వీరిద్దరూ ఒక యాడ్ షూటింగ్‌లో కలిసి పనిచేసినప్పుడు స్నేహితులుగా మారి, ఆ ఫ్రెండ్‌షిప్ ప్రేమగా మారిందన్న వార్తలు అప్పట్లో హల్‌చల్ చేశాయి.

Virat Kohli : అనుష్క కాకపోతే కోహ్లీ టాలీవుడ్ బ్యూటీ పెళ్లిని చేసుకోవాల్సిందా ..?
Virat Kohli కోహ్లీ అనుష్క కు ముందు ప్రభాస్ హీరోయిన్ తో డేటింగ్..? నిజమేనా..?
అంతేకాదు ఈ ప్రేమ వ్యవహారం డేటింగ్ నుండి పెళ్లి వరకూ వెళ్ళిందట. కానీ వ్యక్తిగత విభేదాల వల్ల వీరిద్దరు విడిపోయారని రూమర్లు వెలువడ్డాయి. అయితే వీటిపై ఇప్పటికి ఎటువంటి అధికారిక సమాధానం రాలేదు. కొందరు ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ, పుకార్లని చెబుతున్నారు. సెలబ్రిటీల జీవితం పట్ల ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఇలాంటి వార్తలను చక్కెర కొట్టి ప్రచారం చేస్తుంటారు. నిజంగా వీరి మధ్య ప్రేమ ఉందా? లేక ఇదంతా ఊహగానాలా? అన్నది ఇప్పటికీ స్పష్టత రాలేని అంశం.
ఇక తమన్నా విషయానికొస్తే..20 ఏళ్లుగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. సౌత్‌లో అగ్రహీరోలందరితోనూ సినిమాలు చేసింది. బాలీవుడ్‌లో కూడా కొన్ని అవకాశాలు దక్కించుకున్నా, అక్కడ సౌత్ అంత గుర్తింపు పొందలేకపోయింది. ఇటీవల విజయ్ వర్మతో ఆమె డేటింగ్‌లో ఉందన్న వార్తలు వస్తున్న సందర్భంలో, ఇప్పుడు వారి మధ్య బ్రేకప్ అయ్యిందన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.