Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన దేశ విదేశాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటి నుంచో తెలుగు సినిమా దగ్గర ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న మెగాస్టార్ క్రేజ్ కి ఎప్పటి నుంచో ఎల్లలు లేవు.. అయితే ఈ క్రేజ్ మన తెలుగు ఆడియెన్స్ తెలుగు స్టేట్స్ కి మాత్రమే పరిమితమే అనుకునే వారి కోసం ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి రివీల్ అయ్యింది. తాజాగా విరాట్ కోహ్లీ ని తన రూమ్ మేట్ అండర్ 15 టైం లో తన ఫ్రెండ్ అందులో తెలుగువాడవు అయినటువంటి ద్వారకా రవితేజ కలవడం జరిగింది. రవితేజ తన పోస్ట్‌లో ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు.
రవితేజ ప్రస్తుతం డొమెస్టిక్ సర్క్యూట్‌లో మేఘాలయ తరపున ఓ తెలుగు వాడు క్రికెట్ ఆడుతున్నాడు. కాకినాడలో 1987లో పుట్టిన రవితేజ చాలాకాలంగా మేఘాలయ కోసం రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రికెటర్‌కి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. అందుకే మ్యాచ్‌ల సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన సినిమాల పాటలు పెట్టుకుని డ్యాన్స్‌లు వేస్తుండేవాడు. రవితేజ, విరాట్ కోహ్లీ కలిసి అండర్ 15 కోసం కలిసి మ్యాచులు ఆడారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తాజాగా 34 ఏళ్ల రవితేజని దాదాపు ఆరేళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో సిరీస్ ఆడేందుకు వచ్చిన విరాట్‌ని కలిశాడు. ఈ సందర్భంగా రవితేజ చేసిన పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
యూకేలోఐపీఎల్ అయిపోయిన దాదాపు 6 సంవత్సరాల తర్వాత అతన్ని కలిశాను. మొదట అతను విష్ చేస్తూ చిరు ఎలా ఉన్నావు అని అడిగాడు. అండర్ 15 అడుతున్న కాలంలో నేను, విరాట్ రూమ్‌మేట్స్. ఆ సమయంలో నేను టీవీలో చిరంజీవి సాంగ్స్ చూసేవాడిని. అతను ఆ పాటలకి డ్యాన్స్ చేసేవాడు. అప్పటి నుంచి మేము ఒకరిని ఒకరం చిరు అనే నిక్‌నేమ్‌తో పిలుచుకుంటూ ఉంటాం. నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది చిరు’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి ఇప్పుడు ఈ వ్యవహారం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.