Chiranjeevi : ఇది క‌దా చిరంజీవి క్రేజ్ అంటే.. మెగాస్టార్ పాట‌ల‌కు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : ఇది క‌దా చిరంజీవి క్రేజ్ అంటే.. మెగాస్టార్ పాట‌ల‌కు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ

 Authored By sandeep | The Telugu News | Updated on :13 July 2022,3:30 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న దేశ విదేశాల‌లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటి నుంచో తెలుగు సినిమా దగ్గర ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న మెగాస్టార్ క్రేజ్ కి ఎప్పటి నుంచో ఎల్లలు లేవు.. అయితే ఈ క్రేజ్ మన తెలుగు ఆడియెన్స్ తెలుగు స్టేట్స్ కి మాత్రమే పరిమితమే అనుకునే వారి కోసం ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి రివీల్ అయ్యింది. తాజాగా విరాట్ కోహ్లీ ని తన రూమ్ మేట్ అండర్ 15 టైం లో తన ఫ్రెండ్ అందులో తెలుగువాడవు అయినటువంటి ద్వారకా రవితేజ కలవడం జరిగింది. ర‌వితేజ త‌న పోస్ట్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తెలియ‌జేశాడు.

రవితేజ ప్రస్తుతం డొమెస్టిక్ సర్క్యూట్‌లో మేఘాలయ తరపున ఓ తెలుగు వాడు క్రికెట్ ఆడుతున్నాడు. కాకినాడలో 1987లో పుట్టిన రవితేజ చాలాకాలంగా మేఘాలయ కోసం రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రికెటర్‌కి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. అందుకే మ్యాచ్‌ల సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన సినిమాల పాటలు పెట్టుకుని డ్యాన్స్‌లు వేస్తుండేవాడు. రవితేజ, విరాట్ కోహ్లీ కలిసి అండర్ 15 కోసం కలిసి మ్యాచులు ఆడారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తాజాగా 34 ఏళ్ల రవితేజని దాదాపు ఆరేళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో సిరీస్ ఆడేందుకు వచ్చిన విరాట్‌ని కలిశాడు. ఈ సందర్భంగా రవితేజ చేసిన పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Virat Kohli steps to Chiranjeevi songs

Virat Kohli steps to Chiranjeevi songs

Chiranjeevi : చిరు క్రేజ్ ఇది..

యూకేలోఐపీఎల్ అయిపోయిన దాదాపు 6 సంవత్సరాల తర్వాత అతన్ని కలిశాను. మొదట అతను విష్ చేస్తూ చిరు ఎలా ఉన్నావు అని అడిగాడు. అండర్ 15 అడుతున్న కాలంలో నేను, విరాట్ రూమ్‌మేట్స్. ఆ సమయంలో నేను టీవీలో చిరంజీవి సాంగ్స్ చూసేవాడిని. అతను ఆ పాటలకి డ్యాన్స్‌ చేసేవాడు. అప్పటి నుంచి మేము ఒకరిని ఒకరం చిరు అనే నిక్‌నేమ్‌తో పిలుచుకుంటూ ఉంటాం. నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది చిరు’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA DB (@dwarakaraviteja)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది