Vishnu Priya : ‘ఆ రాత్రి 100 వాల్కనోలు పెలిపోయాయి ‘ జెడి చక్రవర్తి పై సంచలన వ్యాఖ్యలు చేసిన విష్ణు ప్రియ..!!
Vishnu Priya : బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుర్రాలలో బీభత్సమైన పాపులారిటీ..విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విష్ణు ప్రియ ఫొటోస్ మరియు వీడియోస్ కి విపరీతమైన లైకులు కామెంట్లు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఆమె ఇటీవల ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ ఫైవ్ కి గెస్ట్ గా రావటం జరిగింది. ఈ క్రమంలో సీనియర్ హీరో జేడీ చక్రవర్తి పై ఎవరు ఊహించని రీతిలో కామెంట్లు చేసింది.
విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జేడీ చక్రవర్తి ఉద్దేశించి విష్ణు ప్రియ మాట్లాడుతూ..” ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది. జె.డి చక్రవర్తి సార్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే ఆయన ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా అంటూ ఓపెన్ గా చెప్పేసింది. ఈ క్రమంలో ఓంకార్ ఎందుకు ఆయన అంటే ఇష్టం నీకంటే ఆయన పెద్దవారు కదా అని ప్రశ్నించగా…దానికి ఆన్సర్ ఇస్తూ .. ఆయనతో కలిసి ఒక వెబ్ సిరీస్ చేశానని ..
Anchor Vishnu Priya swaying for a ks
ఆ టైంలోనే ఆయనతో ట్రావెల్ చేశానని .. అప్పుడే ఆయన మంచి మనసు నాకు అర్థమైంది “అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు 2022 నవంబర్ 25వ తేదీ రాత్రి ఆయనంటే నాకు ఇష్టం అన్న సంగతి నాకు తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది. ఒక్కసారిగా అలా వాల్కనో పేలింది అంటూ చెప్పడం ఓంకార్ కి షాక్ ఇచ్చింది. ఆల్రెడీ జెడి చక్రవర్తి గారికి పెళ్లయింది అని ఓంకార్ తెలియజేయగా పరవాలేదు.. ఆయన ఒప్పుకుంటే… పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం ఆల్రెడీ ఆయనకి కూడా చెప్పాను. ఆయన ఆన్సర్ కోసం వెయిటింగ్ అంటూ అంటూ విష్ణు ప్రియ.. షోలో కీలక వ్యాఖ్యలు ఓపెన్ గా చేయడం జరిగింది.
