Vishwak Sen : బన్నీపై పరోక్షంగా హీరో విశ్వక్ సేన్ డైరెక్ట్ వార్నింగ్ వీడియో..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 27 July 2023, 6:00 pm

Vishwak Sen : డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన “బేబీ” తెలుగు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, వీరాజ్ అశ్విన్, నాగబాబు మరికొంతమంది కీలక నటీనటులు నటించిన ఈ సినిమా తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. సెన్సార్ గా ప్రేమించిన వ్యక్తిని మోసం చేసిన యువతిగా వైష్ణవి చైతన్య నటన.. తెలుగు కుర్రాళ్ళ గుండెలను లాగిపెట్టి తన్నినట్టుంది. బేబీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సునామీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమా విజయం సాధించటంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఇటీవల బేబీ సినిమా యూనిట్ ని ప్రశంసిస్తూ.. కార్యక్రమం నిర్వహించారు.

అయితే మొదట ఈ సినిమా స్టోరీ ని సాయి రాజేష్.. కుర్ర హీరో విశ్వక్ కి వినిపించడం తెలిసిందే. స్టోరీ వినక ముందే.. విశ్వక్ సేన్, బేబి ప్రాజెక్టుని పక్కన పెట్టడం జరిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ విషయాన్ని.. విశ్వక్ పేరు ఎత్తకుండానే.. ప్రస్తావించటం సంచలనం సృష్టించింది. అయితే బన్నీ తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో “పేక మేడలు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన విశ్వక్ రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేటట్లు విశ్వక్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనకున్న టైం బట్టి బేబీ సినిమా ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. అదే సమయంలో బేబీ సినిమా ట్రైలర్ బాగుందని మొట్టమొదటిగా తెలుగు డైరెక్టర్ల వాట్సాప్ గ్రూప్ లో మొదట రియాక్ట్ అయింది కూడా తానేనని స్పష్టం చేశారు.

Vishwak Sen comments on Allu arjun

Vishwak Sen comments on Allu arjun

తాను ఇక్కడ అందరినీ సంతోష పెట్టడానికి బిర్యాని కాదని.. విశ్వక్ కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శకుడుని పిలిచి అతను చెప్పే స్టోరీ విని నువ్వు చెప్పటం కంటే ముందుగానే నో చెప్పాను. అది కూడా నా వ్యక్తిగతమైన ఛాయిస్. అసలు నేను చేద్దామనుకున్నా సినిమా. సినిమా బాగుంట తలెత్తుకోవాలి అంతేగాని.. ఇతరులను కించపరచకూడదు అంటూ విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp