Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అతను తాజాగా నటిస్తున్న చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. మే 6న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. మొదటి నుండి ఈ సినిమాకి వెరైటీ ప్రచారం కల్పిస్తున్నారు. రీసెంట్‌గా నడిరోడ్డుపై ఓ వ్యక్తితో విశ్వక్ సేన్ ఆడిన డ్రామా అందరికి ఆగ్రహం తెప్పిస్తుంది. విశ్వక్ సేన్ ఫిలిం నగర్ రోడ్డులో వెళుతుంటే ఓ యువకుడు ఆయన కారుకు అడ్డంగా పడుకున్నాడు. వెంటనే విశ్వక్ సేన్ ఆయన టీమ్ బయటకు దిగి ఆ యువకుడితో మాట్లాడే ప్రయత్నం చేశారు.
ఆ యువకు చేతిలో పెట్రోలు డబ్బా ఉంది.అల్లం అర్జున్ కుమార్ ఎక్కడ సార్.. ఈ కారులోనే వస్తున్నాడని అన్నారు. అల్లం అర్జున్ కుమార్‌కి ముడ్డి కిందకు 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నేను పెట్రోలు పోసుకని సూసైడ్ చేసుకుంటాను అంటూ నడిరోడ్డుపై తెగ హంగామా చేయడం ప్రారంభించాడు. విశ్వక్ సేన్ ఆ యువకుడిని ఆపుతూ నేనే అర్జున్ కుమార్ అని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సదరు యువకుడు వినిపించుకోలేదు. అల్లం అర్జున్ కుమార్ మీరు (విశ్వక్ సేన్) కాదని, తను మీసాలతో ఉంటాడని.. తనకు పెళ్లి కాకపోతే చనిపోతానని అరవడం మొదలు పెట్టాడు.
అయితే విశ్వక్ సేన్.. అల్లం అర్జున్ కుమార్‌కి మే 6న పెళ్లి అవుతుందని కంగారు పడకని చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. చివరకు విశ్వక్ సేన్ కారు దిగి తన కారులో లక్ష్మణ్‌ను ఎక్కించి అక్కడ్నుంచి పంపేయడమే కాకుండా, ఆటోలో తన కారుని ఫాలో అయ్యాడు. ఇదంతా నిజంగానే జరిగిందని కంగారుపడ్డ అభిమానులు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని వారిపై మండిపడుతున్నారు. ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి ఐమ్యాక్స్ ముందు యూ ట్యూబ్ ఛానెల్స్‌కు రివ్యూలు చెబుతుంటాడు. అతనితో కలిసి చిత్ర యూనిట్ చేసిన ఫ్రాంక్ వీడియో ఇది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
This website uses cookies.