Home » Entertainment » Vishwak Sens Sensational Speech At Simhadri Re Release Event
Entertainment

Vishwak Sen : సింహాద్రి రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సంచలన స్పీచ్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 18, 2023, 7:00 pm
Advertisement

Vishwak Sen : 20 సంవత్సరాల క్రితం విడుదలైన ఎన్టీఆర్ “సింహాద్రి” బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ నీ పూర్తిగా మాస్ ప్రేక్షకుల వద్దకు చేర్చడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ స్టార్ హీరోలకు సంబంధించి బ్లాక్ బస్టర్ హిట్స్ మళ్లీ విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ సింహాద్రి మే 20వ తారీకు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆరోజు దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్ లపై ప్రదర్శించబోతున్నారు.

Advertisement

vishwak sens sensational speech at simhadri re release event

ఈ క్రమంలో సింహాద్రి రీ రిలీజ్ వేడుక పురస్కరించుకొని ఫంక్షన్ కూడా బుధవారం నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు యంగ్ హీరో విశ్వక్ తో పాటు దర్శకులు హను రాగవపూడి, గోపీచంద్ మలినేని, నిర్మాత నవీన్ యెర్నేని పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ… దేశమంతా.. సింహాద్రి రీ రిలీజ్ గురించి చర్చించుకుంటుంది. ఇదొక నేషనల్ న్యూస్. ఎన్టీఆర్ అభిమానిగా గర్వపడుతున్న. నాకు తెలిసినంతవరకు ఏ అభిమానికి ఇలాంటి అవకాశం వచ్చి ఉండదు.

Advertisement

లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుక అనంతరం మరో రెండు రోజులు ఉండమని అక్కడివారు ఎన్టీఆర్ ని కోరిక… హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కి హాజరుకావాలని అన్నారట. ఈ విషయం నాకు ఒకరి చెబితే తెలిసింది. ఆ రకంగా అభిమానులకు ఎన్టీఆర్ గౌరవం ఇస్తారు. నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ టైంలో రావటం నిజంగా నేను మర్చిపోలేనిది ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను…అని విశ్వక్ సేన్ సంచలన స్పీచ్ ఇచ్చారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి