Jr NTR : అభిమానులు చేసిన రచ్చకి సీరియస్ అయిన ఎన్టీఆర్.. వెళ్లిపోతానంటూ వార్నింగ్
Jr NTR : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో వార్ 2 చిత్రం రూపొందగా, ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. తెలుగు వెర్షన్ ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నాగవంశీ విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఏర్పాటు చేయగా, దీనికి వేలాదిగా ఎన్టీఆర్ అభిమానులు తరలి వచ్చారు.
Jr NTR : అభిమానులు చేసిన రచ్చకి సీరియస్ అయిన ఎన్టీఆర్.. వెళ్లిపోతానంటూ వార్నింగ్
వేదిక వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ రచ్చ పీక్స్ కి చేరుకోవడంతో అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదు. ఎటు చూసినా ఊక వేస్తే రాలనంతమంది ఫ్యాన్స్ కనిపించారు. దాదాపు 1200 మంది పోలీసులు ఆదివారం నాడు యంగ్ టైగర్ ఈవెంట్ ని అదుపు చేసేందుకు విచ్చేసారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రత్యక్షంగా వీక్షించారు.
వేదికపై యంగ్ టైగర్ మాట్లాడుతున్నంత సేపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదుపు చేయడం సాధ్యం కాలేదు. ఫ్యాన్స్ కేకలు గోల పెడుతూ రచ్చ చేసారు. కొందరు అభిమానులు చొక్కాలు విప్పి గాల్లో ఎగరేయడం, తిప్పడం ప్రారంభించారు. ఎన్టీఆర్ మాట్లాడేప్పుడు చాలా డిస్ట్రబ్ చేసారు. అయితే ఒకానొక దశలో ఎన్టీఆర్ తన కోపాన్ని అదుపు చేసుకోవడం కష్టమైంది. అభిమానులను హెచ్చరిస్తూ .. తాను అక్కడి నుంచి వెళ్లిపోవడం ఒక్క సెకండ్ పడుతుందని హెచ్చరించారు. ఒక్క సెకండ్ పట్టదు.. మైక్ ఇచ్చి వెళ్లిపోతాను అంటూ ఫ్యాన్స్ ని హెచ్చరించారు. అనంతరం తన స్పీచ్ ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Prawns : చాలామంది నాన్ వెజ్ ఆహారాలలో చేపలని,చికెన్ ని, మటన్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటితో పాటు…
Brother And Sister : అన్నాచెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచి ఎంతో సన్నిహితంగా, ప్రేమగా పెరిగే…
Electric Rice Cooker : వంట రానివారికైనా సరే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండడం చాలా ఈజీ.…
War 2 Movie : ఇప్పటివరకు వార్తలలో లేని 'వార్ 2' ఒక్క ఈవెంట్‌తోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన…
Konda Murali : హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరగగా,…
Jr Ntr : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ప్రేక్షకులలో ఏ స్థాయి అభిమానం ఉందనేది చెప్పడానికి వార్…
Daily Bath Saide Effects : ఉదయాన్నే లేవగానే చక్కగా స్నానం చేసి తమ రోజువారి దినచర్యలను పాటిస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వైద్యులు వర్షాకాలంలో కొన్ని రకాల పండ్లను తినాలని చెబుతుంటారు. వర్షాకాలంలో కొన్ని రకాల జ్యూసులు…
This website uses cookies.