Bigg Boss Telugu 7 : నీకు మూడ్ వస్తేనే చేస్తావా.. ఛీ.. నీది ఇంత ఛీప్ క్యారెక్టర్ అనుకోలేదు.. రతకపై శుభశ్రీ ఫైర్
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం నామినేషన్ల హడావుడి మళ్లీ మొదలైంది. సోమవారం వచ్చిందంటే చాలు.. నామినేషన్ల హడావుడి మొదలవుతుంది. నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియను మాత్రం కాస్త వెరైటీగా చేయించాడు బిగ్ బాస్. ఇప్పటికే హౌస్ మెట్స్ గా కన్ఫమ్ అయిన శోభాశెట్టి, శివాజీ, సందీప్ ముగ్గురు జడ్జిలుగా వ్యవహరించారు. ఇక నామినేషన్స్ చేయాలనుకున్న వాళ్లను బోన్ లో నిలబెట్టాలి. అయితే.. కంటెస్టెంట్లు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అయితేనే నామినేట్ చేయాలని బిగ్ బాస్ కూడా జడ్జీలకు చెప్పారు. ముందు యావర్ స్టార్ట్ చేశాడు. ప్రియాంక, తేజ ఇద్దరినీ నామినేట్ చేశాడు. కానీ.. తేజకు చెప్పిన పాయింట్స్ తో జడ్జీలు ఏకీభవించలేకపోయారు. దీంతో ప్రియాంకను మాత్రమే నామినేట్ చేశారు. ఆ తర్వాత రెండో వ్యక్తిగా శుభశ్రీ వచ్చి రతిక, అమర్ ఇద్దరినీ నామినేట్ చేసింది. కానీ.. తేజ విషయంలో శుభశ్రీ కారణాలు సరైనవి కావని.. తేజను జడ్జీలు నామినేట్ చేయరు. చివరకు రతికను మాత్రమే నామినేట్ చేస్తారు.
అయితే.. శుభశ్రీ రతికను నామినేట్ చేసేటప్పుడు చెప్పిన పాయింట్స్ ఏంటంటే.. ప్రతిసారి పర్సనల్ విషయాలు చెప్పి సింపతీ తెచ్చుకోవడం కోసం రతిక ప్రయత్నిస్తోందని, నాగార్జున ముందు కూడా రతిక.. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పడం సానుభూతి కోసమేనని.. దాన్ని నేను ఒప్పుకోనని శుభశ్రీ చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరింది. యాక్టివిటీ పరంగా, వర్క్ పరంగా నాకు చాలా కనిపించలేదు. లాస్ట్ నామినేషన్లలో ఇచ్చిన రీజన్, నిన్న చెప్పిన రీజన్ సరిగ్గా అనిపించలేదు. ఎక్స్ ను గుర్తు తెచ్చుకొని వేరే వ్యక్తిని నామినేట్ చేయడం అనేది బిగ్ బాస్ రూల్స్ కు వ్యతిరేకం. గేమ్ లో తనకు క్లారిటీ లేదు. ప్రిన్స్, అమర్ దీప్ దగ్గరికి వెళ్లి ప్రిన్స్ కు సపోర్ట్ చేస్తా అన్నది. ఆ తర్వాత ప్రిన్స్ డిజర్వ్ లేడు అని చెప్పింది. అది రాంగ్ అంటూ శుభశ్రీ చెప్పుకొచ్చింది.
Bigg Boss Telugu 7 : అంత గలీజ్ గా ఎక్స్ గురించి అందరి ముందు చెబుతావు అంటూ శుభశ్రీ ఫైర్
నేను ముందు శోభా శెట్టి, ప్రిన్స్ అనుకున్నా కానీ.. పేరు చెప్పలేదు. ఆ తర్వాత మళ్లీ ముగ్గురే మిగిలారు కాబట్టి అందరిలో కంపేర్ చేసుకుంటే నేను అప్పుడు ప్రిన్స్ అన్నా అంటుంది రతిక. అప్పుడు ఉన్న ముగ్గురు ఆప్షన్స్ వేరు.. కంటెండర్ గా ఆప్షన్స్ వేరు. నా పర్సనల్ గురించి ఆమె మాట్లాడటం ఏంది అంటుంది. ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుతోంది. నేను పర్సనల్ గా ప్రియాంకతో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మధ్యలో విని నామినేట్ చేస్తుందంటే ఆమె క్యారెక్టర్ ఎటువంటిది.. అంటుంది రతిక. దీంతో మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటూ నువ్వు గలీజ్ అంటూ మాట్లాడుతుంది శుభశ్రీ. ఆ పర్సనల్ ఏదో అడుగుతారు అని వెయిట్ చేస్తోంది. నువ్వు నిజంగా ఎవ్వరినైనా ప్రేమిస్తే నువ్వు అలా చేయవు అంటుంది. మొత్తానికి ఇద్దరూ క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేదాకా వెళ్తారు. అయితే.. అమర్ దీప్ ను కూడా శుభశ్రీ వేసుకుంది. నువ్వు మూడ్ వచ్చినప్పుడే పని చేస్తావు అనడంతో అమర్ దీప్ కూడా సీరియస్ అవుతాడు. ఆ తర్వాత రతికనే నామినేషన్లలో పెడతారు. అమర్ దీప్ ను పెట్టరు జడ్జీలు. దీంతో నాలుగో వారం నామినేషన్లలో ఉన్న మొదటి కంటెస్టెంట్ ప్రియాంక కాగా, రెండో కంటెస్టెంట్ రతిక.