VishnuPriya : ప్రేమలో విష్ణుప్రియ దారుణంగా మోసపోయిందా..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: August 13, 2022, 2:40 pm

VishnuPriya : బుల్లితెర ప్రేక్షకులకు విష్ణుప్రియ గురించి తెలియని వారుండరు. తన హాట్ అందాలతో కుర్రాళ్ల మతిపొగొట్టడంలో విష్ణుప్రియది అందె వేసిన చేయ్యి. ఈ హాట్ బ్యూటీ బుల్లితెరపై సుధీర్‌తో చేసిన పోవేపోరా షో ద్వారా పరిచయమైంది.తన గల గల మాటలతో తన గ్లామర్‌తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. ఈ షో తర్వాత కొన్ని షోలు చేసి ఇప్పుడు మాత్రం ఎక్కువగా కనిపించడం లేదు. దాంతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోయిందని చాలామంది అంటున్నారు. యాంకర్‌గా అవకాశాలు రాకపోయినప్పటికీ వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. విష్ణుప్రియ మొదట్లో కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

VishnuPriya : విష్ణుప్రియ ఏం చేస్తోంది..

కానీ అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చింది.కానీ ఇక్కడ కూడా తనకు అవకాశాలు ఎక్కువగా రాలేదు.దీంతో సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ఎప్పుడు టచ్‌లో ఉంటుంది.అంతేకాకుండా తన హాట్ హాట్ గ్లామర్ ఫోటోలతో, డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. జిమ్ వీడియోలతో కూడా విష్ణుప్రియ తన హాట్ అందాలను చూపిస్తున్న విషయం తెలిసిందే. వెండితెరపై ఛాన్సుల కోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తన టాలెంట్ ను బయటపెట్టాలనుకుంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. విష్ణు ప్రియకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోలేక పోతోంది.

Was VishnuPriya badly cheated in love

Was VishnuPriya badly cheated in love

ఇక సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే స్టోరీస్ను చూస్తే ఈమె లవ్ ఫెయిల్ అయిందా అనే అనుమానాలు అందరి మదిలో మెదులుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒకటి ప్రేమకు సంబంధించిన పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది.బ్రేకప్ అయితే మన పని మనం చేసుకోవడమే వాళ్ళను ప్రేమించడం లేదా మర్చిపోవడం ఏదో ఒకటి చేయాలి.వాళ్ల మీద ప్రేమ కచ్చితంగా ఉంటుంది. కానీ నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి నీ లైఫ్ నువ్వు కొనసాగించాలి. వాళ్ల గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. అన్నట్లుగా పోస్ట్ పెట్టింది.ఈ పోస్టు చూసిన వారంతా విష్ణుప్రియ లవ్ ఫెయిల్ అయిందా అని కామెంట్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp