Anchor Pradeep : యాంకర్ ప్రదీప్‌ ఎందుకు సైడ్‌ అవుతున్నాడు.. అసలేం జరుగుతోంది?

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్… ఈ పేరును తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అతడు బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్నాడు. అంతటి పేరు ప్రఖ్యాతలను దక్కించుకున్న యాంకర్ ప్రదీప్ గత కొన్నాళ్లుగా పెద్దగా సందడి చేయడం లేదు. అమ్మాయిల్లో మరియు అబ్బాయిల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ లో ఇంతకు ముందు జోరును కొనసాగిం చడం లేదు. అందుకు కారణం ఏమై ఉంటుంది అనేది ఎవరికీ అర్థం కావటంలేదు. యాంకర్ ప్రదీప్ ఇంతకు ముందు జీ టీవీ, జీ తెలుగు, స్టార్ మా ఇలా ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో కూడా సందడి చేసే వాడు. వాటిలో మాత్రమే కాకుండా సినిమా రిలీజ్ వేడుకలో కూడా హడావుడి చేసే వాడు. కానీ ఇప్పుడు ప్రదీప్ ఈటీవీ లో ప్రసారమవుతున్న ఒక షో లో తప్పితే ఎక్కడా కనిపించడం లేదు.

యాంకర్‌ ప్రదీప్ కనిపించక పోవడం పై నలుగురు నాలుగు రకాలుగా అంటున్నారు. దాంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశ నిస్పృహలను వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రదీప్ ఎందుకు బుల్లి తెరకు దూరంగా ఉంటున్నాడు అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ సమయంలో కొందరు ప్రదీప్ మరో సినిమా కు హీరోగా సైన్ చేసి ఉంటాడు. ఆ సినిమా షూటింగ్లో అతడు బిజీగా ఉండడం వల్లే ఈ షోలకు దూరంగా ఉన్నాడేమో అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తో ఇప్పటికే హీరోగా పరిచయమైన ప్రదీప్ ముందు ముందు మరిన్ని సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

where is anchor pradeep fans under tension

ఆ ఆసక్తితో వరుసగా సినిమాలకు ప్రదీప్ సినిమాలకు కమిట్ అయ్యాడేమో అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రదీప్‌ బుల్లి తెర షో లు చేయడం లేదు అంటే ఆయన సినిమా లో నటిస్తున్నట్లు అంటూ అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. బుల్లి తెరపై ప్రదీప్ లేని లోటును ఏ ఒక్కరు కూడా తీర్చలేకపోతున్నారు. యాంకర్ రవి ప్రయత్నాలు చేస్తున్నా కూడా అతని డబల్ మీనింగ్ డైలాగ్ లకు మరియు ఎగటు పుట్టించే మాటలకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆరోగ్యకరమైన కామెడీ చేసే యాంకర్ ప్రదీప్ ని బుల్లి తెర ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్లీజ్ అంటూ అభిమానులు పిలుస్తున్నారు. మరి ఇప్పుడు కాకున్నా మరికొన్ని రోజులకైనా యాంకర్ ప్రదీప్ బుల్లి తెరపై మళ్లీ హడావుడి చేస్తాడా అనేది చూడాలి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

1 month ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

1 month ago