Home » Entertainment » Where Is Hyper Aadi And Why He Is Not Doing Movies And Shows
Entertainment

Hyper Aadi : హైపర్ ఆది అక్కడ ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 20, 2022, 11:00 am
Advertisement

Hyper Aadi : గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అంటే హైపర్ ఆది.. హైపర్ ఆది అంటే జబర్దస్త్ అన్నట్లుగా కొనసాగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రారంభం అయిన తర్వాత పూర్తి ఆధిపత్యాన్ని హైపర్ ఆది కనబరుచుతూ వచ్చాడు. కేవలం కామెడీ షో లు మాత్రమే కాకుండా స్టార్ మా లో ప్రసారం అయినటువంటి షోల్లో కూడా ఈయన సందడి చేశాడు. ఇక ఈ టీవీ లోనే ప్రసారమైన ఢీ డాన్స్ షో కార్యక్రమంలో కూడా హైపర్ ఆది పాల్గొన్నారు. ఈ సమయంలోనే సినిమాల్లో కూడా నటించాడు.

Advertisement

ఒకేసారి ఇన్ని చోట్ల సందడి చేసిన హైపర్ ఆది ఇప్పుడు అక్కడ ఎక్కడా కనిపించడం లేదు. ఈటీవీ లో జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించడం లేదు. అలాగే స్టార్ మా లో కూడా ఈయన సందడి లేదు. ఇక చివరికి సినిమాల్లో వరుసగా నటిస్తున్నాడా అంటే అది కూడా లేదు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కనిపించకుండా పోయాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకు కారణం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ మధ్య కాలంలో హైపర్ ఆది కాస్త ఎక్కువ లావు అయ్యాడట..

where is Hyper Aadi and why he is not doing movies and shows

Advertisement

ఆ లావు తగ్గించుకోవడం కోసం హైపర్ ఆది ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే అన్ని కార్యక్రమాలకు మరియు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన సన్నిహితులు మాత్రం హైపర్ ఆది ఎప్పటిలాగే బిజీగా ఉన్నాడు. ఏదో ఒక షూటింగ్ తో హడావుడిగానే ఉన్నాడు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఏ షూటింగ్ లో ఉన్నాడు.. ఏ కార్యక్రమాలు ఆయన నుండి వస్తున్నాయి అనేది మాత్రం ఏ ఒక్కరు చెప్పడం లేదు. మొత్తానికి హైపర్ ఆది యొక్క హడావుడి తగ్గడంతో ఆయన అభిమానులు చాలా అసంతృప్తితో ఉన్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి