chiranjeevi : చిరుకు సీఎం కావాలనే కోరిక ఎలా కలిగింది.. ఆ సినిమా ఎఫెక్ట్ ఆయనపై ఇంకా ఉందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

chiranjeevi : చిరుకు సీఎం కావాలనే కోరిక ఎలా కలిగింది.. ఆ సినిమా ఎఫెక్ట్ ఆయనపై ఇంకా ఉందా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :29 December 2021,7:40 pm

chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఊగిపోతారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలే. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. దీని వెనుకాల ఎన్నో ఏళ్లు కఠోర శ్రమ దాగి ఉంది. ఆయన ముళ్ల బాటలో నడిచి తనను నమ్ముకున్న ఎంతో మందికి పూల బాట వేసారు. చిరంజీవి సృష్టించిన సామ్రాజ్యంలో ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచే ఏకంగా దాదాపు 10 మంది హీరోలు వచ్చారు. వాళ్లు అనుభవిస్తున్నదంత చిరంజీవి కష్టార్జితం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాలుగు దశాబ్దాలుగా చిరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. చిరు ఇటీవల నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా నర్సింహ రెడ్డి కలెక్షన్ల వర్షం కురిపించాయంటే చిరు స్టామినా ఎంటో అర్థం చేసుకోవచ్చు.

Which Movie Inspired Chiranjeevi to become Chief Minister

Which Movie Inspired Chiranjeevi to become Chief Minister

chiranjeevi : చిరుపై ఆ సినిమా ప్రభావం ఇంకా ఉందా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్న టైంలోనే అభిమానుల కోరిక మేరకు 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలకు ప్రజారాజ్యం కైవసం చేసుకుంది. అయితే, చిరు ముఖ్యమంత్రి కావాలనే కోరిక పార్టీ పెట్టారని తెలిసింది. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కు చిరు కూడా ముఖ్యమంత్రి అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆ టైంలో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనం ఫాలోయింగ్ ముందు చిరు సినిమా పలుబడి సరిపోలేదు.

Which Movie Inspired Chiranjeevi to become Chief Minister

Which Movie Inspired Chiranjeevi to become Chief Minister

అయితే, చిరు రాజకీయాల్లోకి రావడానికి గతంలో నటించిన సినిమానే కారణమని, దాని ప్రభావమే ఆయనపై అధికంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ముఠామేస్త్రీ సినిమాలో మార్కెట్లో కూలీగా పనిచేస్తూ ఏకంగా చిరంజీవి మంత్రి స్థాయికి ఎదుగుతాడు. అది రీల్ లైఫ్ కాబట్టి జరిగింది. రియల్ లైఫ్‌లో అవన్నీ పాసిబుల్ కావని చిరు గుర్తించలేకపోయారు. కానీ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. మెయిన్‌గా ముఠామేస్త్రీ సినిమా ప్రభావం వల్లనే చిరుకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉండిందని పలువురు అనుకుంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది