Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్‌లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరంటే?
Bigg Boss 6 Telugu :బిగ్‌బాస్ సీజన్ -6 శరవేగంగా ఎలిమినేషన్ రౌండ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు ఎలిమినేషన్స్ పూర్తవ్వగా తాజాగా నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తిగా మారింది. షో ప్రారంభం అయిన మొదటి వారం ఎలిమినేషన్ రద్దు చేసిన బిగ్‌బాస్ ( Bigg Boss).. రెండో వారంలో ఏకంగా ఇద్దరిని బయటకు పంపించాడు.
Bigg Boss 6 Telugu :ఈ వారం కూడా ఇద్దరు పోతారా..
రెండో వారంలో షానీ, అభినయశ్రీ ఎలిమినేట్ అవ్వగా.. మూడో వారంలో ఇనయ, ఆరోహి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది.కానీ అనుకోకుండా నేహా చౌదరిని ఎలిమినేట్ అయ్యింది. ఇక నాలుగో వారం ఎలిమినేషన్ దగ్గర పడటంతో సభ్యులు అందరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ వారం ఐదుగురు మాత్రమే ఎలిమినేషన్‌కు నామినేట్ అయినట్లు సమాచారం. నామినేట్ అయిన వారిలో రాజశేఖర్, ఆర్ జె సూర్య, అర్జున్ కళ్యాణ్, సుదీప, ఆరోహీ ఉన్నారు.
వీరిలో సుదీపా అలియాస్ పింకీ, ఆరోహి ముందు వరుసలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. చివరగా అర్జున్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది.బిగ్‌బాస్ సీజన్ -6లో ఈ వారం ఎలిమినేషన్‌లో సుదీపా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఆర్ జె సూర్య పేరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వారం సుదీప ఎలిమినేట్ అయితే హౌస్ మేట్స్ ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాలి. ఇక ఆర్ జె సూర్య బయటకు వెళితే ఆరోహి ఒంటరి అవుతుందని అంటున్నారు.
ఇక అర్జున్ కళ్యాణ్ పేరు కూడా ఈ వారం ఎలిమినేషన్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అర్జున్ కళ్యాణ్ పోతే శ్రీసత్యతో గొడవ పడేవారు ఉండరని అందరికీ తెలుసు. హోటల్ టాస్కులో వీరిద్దరు చేసిన పనికి ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అయ్యారు. శ్రీసత్య చేతుల మీదుగా అర్జున్ ఆమ్లేట్ వేయించుకుని తినిపించుకున్న విషయం తెలిసిందే.