Hero Shivaji Wife : చెల్లెలునే లేపుకెళ్లి బిగ్ బాస్ శివాజీ పెళ్లి చేసుకున్నాడా? అసలు ఆయన భార్య ఎవరు? ఎలా పరిచయం అయింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hero Shivaji Wife : చెల్లెలునే లేపుకెళ్లి బిగ్ బాస్ శివాజీ పెళ్లి చేసుకున్నాడా? అసలు ఆయన భార్య ఎవరు? ఎలా పరిచయం అయింది?

 Authored By kranthi | The Telugu News | Updated on :6 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  హీరో శివాజీ భార్య పేరు ఏంటి?

  •  శివాజీది లవ్ మ్యారేజా? లేక అరేంజ్ మ్యారేజా?

  •  శివాజీ పెళ్లి విషయంలో ఎందుకు రగడ స్టార్ట్ అయింది

Hero Shivaji Wife : హీరో శివాజీ తెలుసు కదా. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొన్నేళ్లు పాటు వెలుగొందాడు. ఆ తర్వాత ఏమైందో కానీ.. ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ నటించాడు శివాజీ. ఒకానొక సమయంలో ఓ రేంజ్  ని మెయిన్ టెన్ చేసిన శివాజీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి తన ఇమేజ్ ను తానే డ్యామేజీ చేసుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోకి వెళ్లాక మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు శివాజీ. శివాజీలోకి కొత్త కోణాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు శివాజీలో ఉన్న ఒక కోణాన్ని మాత్రమే మనం సినిమాల్లో, రాజకీయాల్లో చూశాం. కానీ.. బిగ్ బాస్ హౌస్ లో అసలు శివాజీ అంటే ఏంటి.. అనేది చూస్తున్నాం. అయితే.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పుడు కాదు కానీ.. ఎప్పటి నుంచో శివాజీ పెళ్లిపై చాలా రూమర్లు షికారు చేశాయి. ఆయన పెళ్లి విషయంలో చాలా పుకార్లు పుట్టాయి. తనకు చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిని లేపుకెళ్లి శివాజీ పెళ్లి చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. అసలు శివాజీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎవరు? నిజంగానే చెల్లెలును శివాజీ లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడా? అనే విషయాలు తెలుసుకుందాం రండి.

అసలు శివాజీ పెళ్లి చేసుకున్న అమ్మాయి తన చెల్లెలు కాదు. తనకు వరుసకు చెల్లెలు అస్సలు కాదు. శివాజీకి రెండు పెళ్లిళ్లు అయ్యాయి అనేది కూడా అబద్ధం. అసలు తన భార్య తన బంధువే కాదు. వాళ్ల క్యాస్ట్ కూడా కాదు. శివాజీది ఏపీలోని గుంటూరు జిల్లా అని తెలుసు కదా. తన భార్య పేరు శ్వేత. తనది తెలంగాణలోని నిజామాబాద్. తను గౌడ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఆమె ఎవరో కాదు.. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తోడల్లుడి కూతురు. శివాజీ చౌదరి అని అందరికీ తెలుసు. ఆమె గౌడ్స్. ఇక.. ఆమె వరుసకు చెల్లెలు ఎలా అవుతుంది. అందులోనూ వీళ్లది లవ్ మ్యారేజీ కూడా కాదు. అంటే లవ్ కమ్ అరేంజ్ అని చెప్పుకోవచ్చు. తనను ఓ ఫంక్షన్ లో చూసి శివాజీ ఇష్టపడ్డాడు. ఇద్దరూ మాట్లాడుకున్నరు. ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఇరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

Hero Shivaji Wife : తన భార్యకు షూటింగ్ అంటే తెలియదు

తన భార్య శ్వేతకు షూటింగ్ అంటే తెలియదని.. తనకు సినిమాల గురించి కూడా ఎక్కువగా పరిచయం లేదని చెప్పాడు శివాజీ. శివాజీ ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి కావడం వల్ల రూపాయి కట్నం తీసుకోకుండా శ్వేతను పెళ్లి చేసుకున్నాడు. తను సెలబ్రిటీ అయినా కూడా చాలా సామాన్య వ్యక్తిగా జీవిస్తుంటాడు శివాజీ. ఇక.. తనపై ఇలా చెల్లెలును లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నడు అనే పుకార్లు పుట్టించింది రాజకీయ నాయకులే. అప్పట్లో శివాజీ కొన్ని రోజులు బీజేపీలో ఉండి ఆ తర్వాత బీజేపీ నుంచి బయటికి వచ్చి టీడీపీకి వీరాభిమాని అయ్యాడు. అప్పుడు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. అప్పుడు వైసీపీ నాయకులు ఇలా శివాజీని ఇరికించేందుకు తన పెళ్లిని పావుగా వాడుకున్నారు. ఆ తర్వాత అవన్నీ ఉత్త పుకార్లే అని శివాజీ కుండ బద్ధలు కొట్టడంతో ఆ ఇష్యూ అక్కడితో ముగిసిపోయింది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది