Home » Entertainment » Why Bomma Adirindi Not Telecasting From Last Week
Entertainment

బొమ్మ అదిరింది కూడా అవుట్.. పాపం నాగబాబును నమ్ముకున్న వాళ్ల గతేంటో?

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 2, 2021, 9:19 pm
Advertisement

జబర్దస్త్‌ షోలో ఉన్నంత కాలం నాగబాబు మహారాజ యోగం పట్టింది. అందులో తాను చెప్పిందే శాసనం అనేట్టుగా జరిగింది. కానీ మధ్యలో కొన్ని విబేధాలు రావడంతో.. నితిన్ భరత్ అనే డైరెక్టర్ల కోసం నాగబాబు జబర్దస్త్‌ను వీడిపోయాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన నాగబాబు.. నితిన్ భరత్‌లతో కలిసి అదిరింది ప్రోగ్రాంను ప్రారంభించారు. అది చాలా గ్రాండ్‌గానే మొదలుపెట్టేశారు. కానీ చివరకు అది అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

Advertisement

why Bomma Adirindi Not telecasting from last week

యాంకర్‌గా ఉన్న సమీరను పీక పారేశారు. ఆ తరువాత భానుశ్రీ, రవిలను పట్టుకొచ్చారు.. జడ్జ్‌గా నవదీప్‌ను కూడా పెట్టేశారు. కానీ లాభం లేకుండా పోయింది. అదిరిందికి రిపేర్లు చేసి బొమ్మ అదిరిందిగా మార్చేశారు. ఈ సారి యాంకర్లుగా ఉన్న భాను, రవిలను పీకేసి శ్రీముఖిని పట్టుకొచ్చారు. నవదీప్‌ను తీసేసి.. జానీ మాస్టర్‌ను లాక్కొచ్చారు. అయితే బొమ్మ అదిరింది బాగానే క్లిక్ అయినా కూడా ప్రస్తుతం దానికి కూడా దిక్కుతోచని పరిస్థితి ఎదురైనట్టు కనిపిస్తోంది.

Advertisement

నాగబాబు తన యూట్యూబ్ చానెల్ మీద దృష్టి పెట్టేశాడు. బొమ్మ అదిరింది షో గత వారం ప్రసారం కాలేదు. ఈ ఆది వారం కూడా దాని ఊసే లేదు. మొత్తంగా బొమ్మ అదిరింది అడ్రస్ గల్లంతైనట్టు కనిపిస్తోంది. నాగబాబును నమ్ముకుని జబర్దస్త్ నుంచి వచ్చిన వారి పరిస్థితి మాత్రం అధోగతి పాలయ్యేలా ఉంది. చమ్మక్ చంద్ర ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో చూడాలి. అసలు బొమ్మ అదిరింది షో ఉందా? లేదా? ఉంటే ఏమైనట్టు? రెండు వారాలుగా ఎందుకు కనిపించడం లేదు? అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి