Tamannaah : తమన్నా సడన్‌గా పిల్లల గురించి ఎందుకు మాట్లాడింది.. అంటే ఈ పాటికే అతనితో?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tamannaah : తమన్నా సడన్‌గా పిల్లల గురించి ఎందుకు మాట్లాడింది.. అంటే ఈ పాటికే అతనితో??

 Authored By mallesh | The Telugu News | Updated on :17 October 2022,2:30 pm

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్దకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఉన్నట్టుండి తన స్పీడ్ తగ్గించింది. ఏమైందో తెలియదు. ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గిపోయినట్టు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే చాలా కాలంగా సినిమాలు చేస్తున్న తమన్నా బోరింగ్ హీరోయిన్ లిస్టులో చేరిపోయిందని తెలుస్తోంది. అందుకే ఈ నటికి పెద్దగా అవకాశాలు రావడం లేదంట.. తమన్నా 20ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ‌డేస్‌తో తొలి హిట్ అందుకున్న తమన్నా.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది.టాలీవుడ్ అగ్రహీరోలతో సినిమాలు చేసిన తమన్నా..

పాన్ ఇండియన్ ఫిలిం బాహుబలిలోనూ అద్భుతమైన నటనను కనబరిచింది. తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం గడిచిపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళాశంకర్ మూవీలో తమన్నా హీరోయిన్‌గా చేస్తుందట. రీసెంట్‌గా బాలీవుడ్‌లో బబ్లీ బౌన్సర్ సినిమా చేసిన తమన్నా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో బ్యాక్ టు టాలీవుడ్ అనేసింది. తమన్నా మొదట్లో అందాల ఆరబోతకు పెద్దగా ఆసక్తి చూపించకపోయినా కాలంతో పాటు ఆమె కూడా మారుతూ వచ్చింది. అవకాశాల కోసం ఎక్స్‌పోజింగ్‌కు ఓకే చెప్పింది. ప్రస్తుతం కోలివుడ్, టాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తున్న తమన్నా..

Why did Tamannaah suddenly talk about children

Why did Tamannaah suddenly talk about children

Tamannaah : త్వరలోనే పెళ్లి చేసుకోనుందా..

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయట పెట్టేసింది.‘ అందరు అమ్మాయిలకు ఎదురైనట్టే నాకు కూడా ఇంట్లో ఒత్తిడి పెరిగిపోతుంది. ముప్పై ఏళ్లు దాటినందున పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారని.. త్వరలోనే వారి కోరికమేరకు పెళ్లి చేసుకుని పిల్లలకు తల్లి అవ్వాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టేసింది’. ప్రస్తుతం తమన్నా కామెంట్స్ సంచలనంగా మారాయి.ఇక తమన్నా ఇప్పటికే ఒకరితో డేటింగ్ చేస్తుందని, అతనితో పెళ్లికి ముందే కమిట్ అయ్యి తల్లి అవుతుందా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది