Dil Raju : దిల్ రాజుగారి జ‌డ్జిమెంట్ ఎందుకిలా బెడిసి కొడుతుంది… ఎక్క‌డ తేడా వ‌స్తున్న‌ట్టు?

Dil Raju : డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉన్న రాజు దిల్ సినిమాతో మంచి హిట్ కొట్ట‌డ‌మే కాక దిల్ రాజుగా కూడా మారాడు. చిత్ర నిర్మాణాల్లో ప్రయోగాలను సైతం చేసే ఈ నిర్మాతకు ప్రస్తుతం టైం కలిసి రాడం లేదనిపిస్తోంది సినిమాల తీర్పులో చాలా జాగ్రత్తలు పాటిస్తూ బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. అయితే ఇటీవ‌ల దిల్ రాజు ప్ర‌యోగాలు బెడిసి కొడుతున్నాయి. యావ‌రేజ్ కూడా కాదు ఫ్లాప్స్ వ‌స్తున్నాయి. దీంతో ఈ విష‌యం ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు దిల్ రాజు ప్లాన్స్ ఎందుకు వ‌ర్క‌వుట్ కావ‌ట్లేద‌నేది తాజా వీడియో చూస్తే అర్ధ‌మ‌వుతుంది.మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. డిస్ర్టిబ్యూటర్ గా మొదలైన రాజుగారు అంచలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యారు. ఇప్పటివరకూ 49 సినిమాలు నిర్మించారు. సొంత నిర్మాణంలో కొన్ని చిత్రాలు నిర్మించగా..ఇతర నిర్మాణ సంస్థలతో భాగస్వామిగా మారి ఏడెనిమిది సినిమాలు నిర్మించారు.

నిర్మాణంలో ఆయనో స్కూల్ అని చెప్పొచ్చు. ఆ అనుభవంతోనే దర్శకుల కథల విషయంలోనూ అవసరమైన సూచనలు..సలహాలు ఇస్తుంటారు. అవసరం మేర ఆయన అభిరుచుకి తగ్గట్టు దర్శక-రచయితలు కథని ఆ విధంగా మౌల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ గానే దిల్ రాజు చాలా సందర్భాల్లో చెప్పారు. ముఖ్యంగా నవతరం దర్శకుల విషయంలో రాజుగారు ఇన్వాల్వ్ మెంట్ తప్పనసరి. కొన్ని కొన్ని పరిస్థుతుల్లో క్రియేటర్స్ సైతం అతని అనుభవాన్ని రంగరించి పనిచేయాల్సి ఉంటుంది. ఆ రకంగా రాజుగారు కాంపౌండ్ నుంచి ఎంతో మంది దర్శకులు బయటకు వచ్చారు. ఫెయిల్యూర్ దర్శకుల్ని సైతం తన బ్యానర్లో మళ్లీ రీలాంచ్ చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కించిన ఘనత రాజుగారి సొంతం. విజయం ఎన్నడూ శాశ్వతం కాదు.. ముఖ్యంగా సినిమాల విషయంలో ఇది చాలా ముఖ్యం. దర్శక నిర్మాతలు సినిమాలపై వేసే అంచనాలే సక్సెస్ కు పునాదులుగా నిలుస్తాయి. ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ వంటి నిర్మాతలు సినిమాపై జడ్జిమెంట్ కెపాసిటీని పెంచుకుంటూ పోతుంటారు.

Why is Dil Raju judgment so disturbing

ఈ విషయంలో దిల్ గత కొద్ది రోజులుగా వెనకబడుతున్నారు. ఇటీవల కాలంలో దిల్ రాజ్ జడ్జ్ మెంట్ మీద అంచనాలు తగ్గుతూ వస్తున్నాయి. అందుకు కారణంగా ఆయన తీసుకున్నంటున్న నిర్ణయాలేనని, స్క్రిప్ట్, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ లోని మార్పులను గుర్తించకపోవడమేనని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.తాజాగా రిలీజ్ అయిన ‘థ్యాంక్యూ’ విషయంలోనూ దిల్ రాజు జడ్జ్ మెంట్ తప్పింది. చివరిగా ‘శ్రీనివాస కళ్యాణం’, తమిళంలో 96 చిత్రాన్ని తెలుగులోకి ‘జాను’తో రీమేక్ చేసినా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం థ్యాంక్యూ విషయంలోనూ అదే జరిగింది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నా.. ఆయన అంచనాలు తప్పుతూ వస్తున్నాయి. ఈ విషయంలో ఎక్కడ తప్పుందో దిల్ రాజుకే తెలియాలని పలువురు అంటున్నారు.

రాజుగారు లాజిక్ లేకుండా ఎలా లాక్ అయ్యారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజుగారు జడ్జిమెంట్లు ఇటీవలి కాలంలో తప్పు అవుతున్నాయని విమర్శ వ్యక్తం అవుతోంది. అయితే అసలు వాస్తవాలు వెలికితీస్తే రాజుగారు మరీ అంత విమర్శించే స్థాయిలో వైఫల్యాలు ఇటీవలి కాలంలో ఇవ్వలేదని ఆయన ట్రాక్ చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్యూ సినిమా రిలీజ్ కిముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు దిల్ రాజు. దీంతో అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. కానీ తొలి షో అనంతరం అవన్నీ నీటి బుడగలా..గాలి తీసేసిన బెలూన్ లో పేలిపోయాయి. రాజుగారు సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఓ బ్రాండ్ ఐడెంటిటీ ఉంటుంది.

కానీ సినిమాలో థాంక్యూ లో అది ఏకోసానా కనిపించలేదు. వైఫల్యాలు ఎదురైనా మరీ ఇంత పేలవంగా మునుపెన్నడు లేని సన్నివేశం ఇది. వాటికి తోడు చైతన్య అభిమానుల్లో అసంతృప్తి. చైతన్యని జోష్ తో రాజుగారు లాంచ్ చేసిన అది అంచనాలు అందుకోలేదు. ఇప్పుడు థ్యాంక్యూ కూడా ఇలా కావ‌డం శోచ‌నీయం.ఇక ‘థ్యాంక్యూ’ మూవీలో అక్కినేని నాగచైతన్య – రాశీఖన్నా జంటగా నటించిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తీరా పూర్ రెస్పాన్స్ నే దక్కించుకుంది. అటు కలెక్షన్స్ లోనూ తొలిరోజు రూ.1.6 కోట్ల వసూళ్లతో ఘోరంగా పరాజయం పాలైంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజునే చాలా నమ్మకంతో నిర్మించారు.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

2 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

3 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

4 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

6 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

7 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

8 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

9 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

10 hours ago