Rashmi Gautam : ఈటీవీ జబర్దస్త్ నుండి కమెడియన్, జడ్జిలు, యాంకర్ ఇలా ఎంతో మంది వెళ్లినా కూడా రష్మి గౌతమ్ మాత్రం వెళ్లడం లేదు. పది సంవత్సరాలుగా జబర్దస్త్ లో కొనసాగుతోంది. ఆమె ఏదైనా ఇతర ఛానల్ కి వెళ్లినా ఒకటి రెండు ఎపిసోడ్ ల వరకి చేస్తుంది తప్పితే పర్మినెంట్ గా ఎక్కడ ఇప్పటి వరకు ఆమె చేసిందే లేదు. ఎన్నో కార్యక్రమాల నుండి ఆమెకు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. రెగ్యులర్ గా ఇతర చానల్స్ వారు ఆమెను ఆహ్వానిస్తూనే ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఆమె ఏ ఒక్క ఛానల్ కి కూడా పూర్తి స్థాయిలో యాంకర్ గా వెళ్లిందే ఆసక్తి చూపలేదు, కారణం ఆమెకు ఈటీవీ పై ఉన్న అభిమానం అలాంటిది. పైగా ఈటీవీలో ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా ఆమెను ఈటీవీ మల్లెమాల వారు గౌరవించారు, అలాగే ఈటీవీ యొక్క ప్రస్థానంలో ఆమెకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే ఆమె కూడా వేరే ఛానల్ నుండి పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చినా కూడా ఆసక్తి చూపించడం లేదు.
ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో రష్మి గౌతమ్ ను ప్రశ్నించగా ఈటీవీలో కంఫర్ట్ ఉన్నంత కాలం కొనసాగుతాను.. ఎప్పుడైతే తనకు కంఫర్ట్ అనిపించదో అప్పుడు పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతాను అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీకి పూర్తిగా దూరమవుతుంది కానీ వేరే ఛానల్ కి మాత్రం వెళ్లే ఉద్దేశం తనకు లేదు అన్నట్లుగా రష్మి గౌతమ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరిచాయి. ఈటీవీ ఆమెకు కెరియర్ ని ప్రసాదించింది. ఎక్కడో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సినిమాల్లో అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో జబర్దస్త్ వాళ్లు పిలిచి అవకాశం ఇచ్చారు.
కనుక ఆమె విశ్వాసంతో ఇతర ఛానల్స్ కి వెళ్లకుండా ఈటీవీలోనే కొనసాగాలని భావిస్తుందట. రష్మీ గౌతమ్ కి కుక్కలు అంటే అమితమైన ప్రాణం.. ఆ కుక్కలకు ఉన్న విశ్వాసం కంటే కూడా రష్మి గౌతమ్ కి విశ్వాసం ఉందని ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. ఈటీవీలోనే జీవితాంతం ఉంటానంటూ ఆమె చెప్పడం ద్వారా మళ్లీ మాల ఈటీవీ వారిపై ఆమెకున్న విశ్వాసం అర్థం అవుతుంది అంటూ అభిమానులు కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి విశ్వాసం చూపించే వాళ్లు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారని, అందులో రష్మి గౌతమ్ ముందు ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ విషయంలో రష్మి గౌతమ్ చాలా గ్రేట్ కదా..!
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.