Guntur Kaaram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలుసు కదా. ఆయన సినిమాలకు మాటలు రాసినా, కథ రాసినా అది కొత్తగా ఉంటుంది. అలాగే.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాల పేర్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి టైటిల్స్. ప్రస్తుతం త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు గుంటూరు కారం. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. చాలా రోజుల నుంచి ఆ సినిమా షూటింగ్ నడుస్తోంది.
అయితే.. ఈమధ్య మహేశ్ బాబు ఎక్కువ వెకేషన్స్ తీసుకుంటున్నారట. అందుకే సినిమా షూటింగ్ రోజురోజుకూ లేట్ అయిపోతోందట. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటుంటే.. మహేశ్ బాబు మాత్రం షూటింగ్ మధ్యలో ఏమాత్రం గ్యాప్ దొరికినా వెకేషన్ అంటూ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తున్నారట.ఇటీవల షూటింగ్ గ్యాప్ లోనూ మహేశ్ బాబు వెకేషన్ అని చెప్పారట. షార్ట్ లీవ్ అని చెపప్పారట. ఫ్యామిలీ అకేషన్ కోసం రెండు మూడు రోజులు లీవ్ అని చెప్పినా.. 15 నుంచి 20 రోజుల వరకు మహేశ్ బాబు షూటింగ్ కు రాలేదట. 2 నుంచి 3 రోజులే బ్రేక్ ఉంటుంది కావచ్చు అని త్రివిక్రమ్ కూడా అనుకున్నారట.
కానీ.. తీరా చూస్తే మహేశ్ బాబు 20 రోజుల వరకు కూడా రాలేదట. దీంతో షూటింగ్ మొత్తం ఆగిపోయిందట. అయితే.. మహేశ్ బాబు కావాలనే త్రివిక్రమ్ ను ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు. ఒకానొక సమయంలో అసలు ఈ సినిమాను వదిలేయాలన్నంత కోపం కూడా త్రివిక్రమ్ కు వచ్చిందట. కానీ.. సూపర్ స్టార్ సినిమా కావడంతో సహనంతో ఉండి సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.