Guntur Kaaram : త్రివిక్రమ్‌కు కోపం తెప్పిస్తున్న మహేశ్ బాబు.. గుంటూరుకారం సినిమాను ఆపేద్దామనుకున్నాడా..?

Advertisement

Guntur Kaaram  : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలుసు కదా. ఆయన సినిమాలకు మాటలు రాసినా, కథ రాసినా అది కొత్తగా ఉంటుంది. అలాగే.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాల పేర్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి టైటిల్స్. ప్రస్తుతం త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు గుంటూరు కారం. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. చాలా రోజుల నుంచి ఆ సినిమా షూటింగ్ నడుస్తోంది.

Advertisement

అయితే.. ఈమధ్య మహేశ్ బాబు ఎక్కువ వెకేషన్స్ తీసుకుంటున్నారట. అందుకే సినిమా షూటింగ్ రోజురోజుకూ లేట్ అయిపోతోందట. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటుంటే.. మహేశ్ బాబు మాత్రం షూటింగ్ మధ్యలో ఏమాత్రం గ్యాప్ దొరికినా వెకేషన్ అంటూ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తున్నారట.ఇటీవల షూటింగ్ గ్యాప్ లోనూ మహేశ్ బాబు వెకేషన్ అని చెప్పారట. షార్ట్ లీవ్ అని చెపప్పారట. ఫ్యామిలీ అకేషన్ కోసం రెండు మూడు రోజులు లీవ్ అని చెప్పినా.. 15 నుంచి 20 రోజుల వరకు మహేశ్ బాబు షూటింగ్ కు రాలేదట. 2 నుంచి 3 రోజులే బ్రేక్ ఉంటుంది కావచ్చు అని త్రివిక్రమ్ కూడా అనుకున్నారట.

Advertisement
why mahesh babu troubling trivikram for guntur kaaram movie
why mahesh babu troubling trivikram for guntur kaaram movie

Guntur Kaaram  : మొన్న కూడా షార్ట్ లీవ్ అని చెప్పి 20 రోజులు షూటింగ్‌కు డుమ్మా కొట్టిన మహేశ్

కానీ.. తీరా చూస్తే మహేశ్ బాబు 20 రోజుల వరకు కూడా రాలేదట. దీంతో షూటింగ్ మొత్తం ఆగిపోయిందట. అయితే.. మహేశ్ బాబు కావాలనే త్రివిక్రమ్ ను ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు. ఒకానొక సమయంలో అసలు ఈ సినిమాను వదిలేయాలన్నంత కోపం కూడా త్రివిక్రమ్ కు వచ్చిందట. కానీ.. సూపర్ స్టార్ సినిమా కావడంతో సహనంతో ఉండి సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement