Mrunal Thakur : సీతారామం హీరోయిన్ డాక్ట‌రా.. యాక్ట‌ర్ ఎందుకు కావాల‌ని అనుకుందో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: August 30, 2022, 7:40 pm

Mrunal Thakur : మృణాల్‌ ఠాకూర్‌.. మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఈ పేరు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. మొద‌ట్లో మరాఠీ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ సీతారామం చిత్రంతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అయింది. ఈ చిత్రంలో మృణాల్ తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మంగ్రముగ్ధుల్ని చేసింది. సీతారామం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందీ చిన్నది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూకడుతున్నాయి. మృణాల్‌కు స్టార్ హీరో సరసన నటించే అవకాశాలు వచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.మృణాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ప్రతిరోజు రకరకాల ఫొటోలతో అభిమానులను పలకరిస్తుంది ఈ భామ.

Mrunal Thakur : ఇది సంగ‌తి..

ఈ చిన్నదానికి ఇన్‌‌స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. మొన్నటివరకు మృణాల్ ను 4.5 మిలియన్ ల మంది ఫాలో అయ్యేవారు. సీతారామం సినిమా తర్వాత ఇప్పుడు 5.4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఒకే ఒక్క సినిమా ఈ ముద్దుగుమ్మకు ఇలా మిలియన్ మంది ఫాలోవర్స్ ను పెంచేసింది. ఇక మృణాల్ త్వరలో మహేష్ సరసన నటిస్తుందని ఓ వార్త వినిపిస్తోంది. రాజమౌళి సినిమా కోసం ఈ అమ్మడిని సంప్రదిస్తున్నారని టాక్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు వెల్లడిస్తూ..ఇండస్ట్రీకి ఎలా ఇచ్చిందన్న విషయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ… డాక్టర్ అవ్వాల్సిన నేను యాక్టర్ అయ్యాను.

Why Mrunal Thakur Get Actress Instead Of Doctor

Why Mrunal Thakur Get Actress Instead Of Doctor

నిజానికి నేను డెంటిస్ట్‌ కోర్స్‌ చేశాను. అందుకోసం రాసిన ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు కూడా వచ్చాయి. అయితే నాకు డాక్టర్ కన్నా నటి అవ్వాలనే కోరిక బలంగా ఉండేదని వెల్లడించింది.అయితే అమ్మానాన్న అందుకు ఒప్పుకునే వారు కాదు. ఎలాగైనా వారిని ఒప్పించాలనే ప్రయత్నంలో ఓరోజు వారికి ‘త్రీ ఇడియట్స్‌’ ను చూపించా.  ఆ సినిమా చూసిన తర్వాతే స్వయంగా అమ్మానాన్నే నన్ను ప్రోత్సహించారు. సినిమాల్లో ప్రయత్నించమని ప్రోత్సహించారు. డెంటల్ డాక్టర్ కావాల్సిన నేను నటిగా మారటానికి అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకొని ప్రోత్సహించటం వల్ల అవకాశాల కోసం ఇండస్ట్రీలో అడుగు పెట్టాను అని వెల్లడించింది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఇలా న‌టిగా అల‌రిస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Telangana Education : తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 10+2 కొత్త‌ విధానం..!"

  2. "Bigg Boss Telugu 10 : కంటెస్టెంట్ల సమక్షంలో బిగ్‌బాస్ హౌస్‌లో శివ్–ప్రియాంక నిశ్చితార్థం..!"

  3. "Ration Card : రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి రేషన్ షాపుల్లో ఈ మూడు సరుకులు..!"

  4. "Parivartana Rajaneeti Party : విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన.. పరివర్తన రాజనీతి పార్టీ పేరుతో ఏపీ రాజకీయాల్లో కొత్త అడుగు"

  5. "Rythu Bharosa : రైతులకు గుడ్‌న్యూస్.. యాసంగి రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్..!"

  6. "RRB NTPC 2026 : ఇంటర్ అర్హతతో 1,688 రైల్వే ఉద్యోగాలు.. చివరి తేదీ ఇదే !"

  7. "Boduppal Narayana School : బోడుప్పల్ నారాయణ స్కూల్‌లో ఘనంగా ఈ-కిడ్స్ స్పోర్ట్స్ మీట్.. చిన్నారుల ప్రతిభకు ప్రశంసలు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp