Nagarjuna : సినిమా వాళ్ళు చనిపోతే నాగార్జున ఎందుకు రాడు పొగరా? చాలా పెద్ద కారణం ఉంది చదవండి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : సినిమా వాళ్ళు చనిపోతే నాగార్జున ఎందుకు రాడు పొగరా? చాలా పెద్ద కారణం ఉంది చదవండి..!!

 Authored By kranthi | The Telugu News | Updated on :19 January 2023,6:20 pm

Nagarjuna : సామాన్యులు చనిపోతే ఎవ్వరూ పట్టించుకోరు. కానీ.. ఎవరైనా సెలబ్రిటీలు చనిపోతే మాత్రం రోజుల తరబడి వాళ్ల గురించి మాట్లాడుకుంటారు. సినిమా సెలబ్రిటీలు కావచ్చు.. రాజకీయ ప్రముఖులు లేదా వ్యాపారవేత్తలు ఎవరు చనిపోయినా వాళ్లకు చాలామంది నివాళులు అర్పిస్తారు. ఇక.. మన తెలుగు ఇండస్ట్రీనే తీసుకుంటే గత సంవత్సరం చాలామంది సెలబ్రిటీలు కన్నుమూశారు. దిగ్గజ నటులే ఈ లోకాన్ని వీడిపోయారు. కృష్ణంరాజు, కృష్ణ, చలపతి రావు, సత్యనారాయణ.. ఇలా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నవాళ్లే వెళ్లిపోయారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా మూగబోయింది.

ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే అందరూ వెళ్లి ఆ ఇంటి సభ్యులను ఓదార్చుతారు. ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తారు. వాళ్లకు ఏదైనా సాయం కావాలంటే అందరూ తలా చేయి వేసి మేమున్నాం అంటూ అండగా నిలబడతారు. అయితే.. ఎంతమంది దిగ్గజ నటులు చనిపోయినా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం వాళ్ల చివరి చూపు చూడటానికి వెళ్లరట. ఆయన కొడుకులు  నాగ చైతన్య, అఖిల్ వెళ్తారు కానీ.. నాగార్జున మాత్రం అస్సలు వాళ్లను కడసారి కూడా చూడటానికి వెళ్లరు అనే విషయం దాదాపుగా అందరికీ తెలుసు. తన నాన్న నాగేశ్వరరావు చనిపోయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. నాగార్జునను ఓదార్చింది. ఏఎన్నార్ కు ఘనమైన వీడ్కోలు అందించారు.

why nagarjuna is not attending for celebrities final rites

why nagarjuna is not attending for celebrities final rites

Nagarjuna : ఏఎన్నార్ చనిపోయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం నాగార్జునను ఓదార్చింది

నాగార్జునకు కూడా ధైర్యం చెప్పారు. కానీ.. తన నాన్న వయసు ఉన్న ఇండస్ట్రీ పెద్దలు మరణిస్తే మాత్రం నాగార్జున ఒక్కరిని కూడా చూడటానికి వెళ్లలేదు. ఆయన వెళ్లి వాళ్లకు నివాళులు అర్పించకపోవడానికి కారణాలు ఏంటి అని అందరూ ఏదేదో ఊహించుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తులను చూడాలంటే భయమా? లేక చనిపోయిన వాళ్లను చూస్తే అదో అపశకునంలా భావిస్తారా? అనేది తెలియక అక్కినేని ఫ్యాన్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు. అసలు.. నాగార్జున ఎందుకు చనిపోయిన వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లకు నివాళులు అర్పించరో అనే విషయంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది