Prabhas : ప్రభాస్ అనుష్కను దూరం పెట్టడానికి అసలు కారణం ఏంటో తెలుసా? వ్యవహారం చాలా దూరం వెళ్లింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్రభాస్ అనుష్కను దూరం పెట్టడానికి అసలు కారణం ఏంటో తెలుసా? వ్యవహారం చాలా దూరం వెళ్లింది

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 December 2021,11:40 am

Prabhas : ప్రభాస్.. Prabhas అనే పేరు ఇప్పుడు కేవలం టాలీవుడ్ కే పరిమితం కాదు. అది ఇంటర్నేషనల్ పేరు. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు ప్రభాస్ అనే పేరు సుపరిచితమే. దానికి కారణం కూడా బాహుబలి సినిమా. ఆ సినిమాతోనే ప్రభాస్  Prabhas ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా.. పాన్ ఇంటర్నేషనల్ సినిమాలు చేస్తూ తన రేంజ్ ను రోజురోజుకూ పెంచుకుంటూ వెళ్తున్నాడు ప్రభాస్.అయితే.. తన వయసు పెరుగుతున్నా ఇంకా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు.అలాగే.. ఇండస్ట్రీలో తనకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్ అంటే అనుష్కానే. అనుష్క anushka తో కలిసి చాలా సినిమాల్లో నటించాడు ప్రభాస్. ఇద్దరి ఈడు జోడు కూడా సూపర్బ్ గా ఉంటుంది.

ప్రభాస్ కు తగ్గ వ్యక్తి అనుష్క అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.అలాగే.. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టమే. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. దీంతో ప్రభాస్, అనుష్క ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. వాళ్లు ప్రేమలో ఉన్నారని అప్పట్లో ఫిలింనగర్ లో బాగానే వార్తలు గుప్పుమన్నాయి.కానీ.. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చాలాసార్లు ప్రభాస్, అనుష్క చెప్పుకొచ్చారు. క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ.. తమ  మధ్య స్నేహబంధం అలాగే కొనసాగుతుందని చెప్పారు. మధ్య మధ్యలో వాళ్లు కలుసుకోవడం.. కలిసి ఫోటోలు దిగడం..

why prabhas rejected anushka shetty

why prabhas rejected anushka shetty

Prabhas  : ప్రభాస్, అనుష్కను anushka విడదీసింది ఎవరు?

రెస్టారెంట్లకు వెళ్లడం అన్నీ జరిగేవి. కానీ.. ఈ మధ్య ప్రభాస్ మాత్రం అనుష్కను దూరం పెట్టేశాడట.ఇద్దరూ ఇప్పుడు మాట్లాడుకోవడం లేదట. కనీసం కలవడం కూడా లేదట. అసలు.. అనుష్క కనిపిస్తే చాలు.. మాట్లాడకుండా దూరం నుంచి వెళ్లిపోతున్నాడట ప్రభాస్ Prabhas. అసలు.. అనుష్క టాపికే తన దగ్గర రాకుండా చూసుకుంటున్నాడట.దానికి కారణం ఎవరో కాదు.. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజే అంటున్నారు. ఇటీవల జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు అనుష్కను పిలిచారట. అక్కడ ప్రభాస్ ను కలిసిన అనుష్క..

అతడిని అందరి ముందే.. కృష్ణంరాజు ఫ్యామిలీ ముందే గట్టిగా కౌగిలించుకుందట. చాలా క్లోజ్ గా మూవ్ అయిందట. దీంతో కృష్ణం రాజు ఫ్యామిలీ అంతా షాక్ అయిందట.సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో ఇవి కామనే కానీ.. అది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కదా. అలా అనుష్క చేసేసరికి.. కృష్ణంరాజుకు కూడా కోపం వచ్చి.. ఇంకోసారి అలా చేస్తే బాగోదు అని డైరెక్ట్ గానే చెప్పేశాడట. అప్పటి నుంచి ప్రభాస్ Prabhas కూడా అనుష్కను దూరం పెట్టాడట. అది అసలు సంగతి.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది