Rashmika Mandanna : ఆస్పత్రి బెడ్‌పై రష్మిక మందన్న.. మళ్లీ అలా చేయొద్దన్న డాక్టర్
Rashmika Mandanna : రష్మిక మందన్న ఆస్పత్రిలో చేరింది. ఆమె బెడ్ పై పడుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.తన అభిమాన నటిని హాస్పిటల్‌లో చేరిందన్న విషయం తెలుసుకుని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తనకు ఏమైందో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. రష్మిక హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యిందన్న విషయంపై డాక్టర్ తాజాగా సామాజిక మాద్యమం వేదికగా స్పందించాడు.
Rashmika Mandanna : మోకాలిపై బరువు పడి..
రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా అవతరించింది. ఆమె అందం, నటనకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా భారీగా వస్తున్నాయట. ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.ఆమె డేట్స్ దొరకడం కూడా కష్టంగా మారిందట.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోందట.. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను వెనక్కి నెట్టింది రష్మిక..బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా మారిన రష్మిక తెలుగులో సినిమాలు తగ్గించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
కాగా,రష్మిక మందన్నా ఉన్నట్టుండి ఆస్పత్రి బెడ్ పై దర్శనమివ్వడంతో ఆమెకు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.దీనిపై ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ స్పందిస్తూ.. రష్మికకు మోకాలి నొప్పి కారణంగా చికిత్స తీసుకోవడానికి వచ్చిందని చెప్పారు. పుష్ప సినిమాలో సామీ సామీ పాటకు నడుం వచ్చి మోకాలిపై బరువు పడేలా డ్యాన్స్ చేయడంతో నొప్పి పెరిగిందని పేర్కొన్నాడు. దీంతో చికిత్స అందించి డిశ్చార్జి చేసినట్టు డాక్టర్ ఏవి గురవారెడ్డి వివరించడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు.